– అమెరికా మాజీ ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్‌గ్రెగర్
- వార్తలను తిప్పికొట్టిన భారత ప్రభుత్వం
న్యూదిల్లీ, మార్చి 5: మధ్యప్రాచ్యంలో కొన్ని రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా నావికాదళం భారత నౌకలను ఉపయోగిస్తోందంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారాలను కేంద్రం ఖండించింది. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా మాజీ ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్‌గ్రెగర్ ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ.. ’గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలపై ఒత్తిడి పెరగడంతో మా నావల్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. మా నౌకాశ్రయ సదుపాయాలూ ధ్వంసమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము భారత్, ఆ దేశానికి చెందిన నౌకాశ్రయాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది సరైన మార్గం కాదు. అయినప్పటికీ పరిస్థితుల ప్రభావం కారణంగా అలా చేయక తప్పడం లేదు’ అని మాక్‌గ్రెగర్ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ డియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ ఫ్యాక్ట్‌చెక్ విభాగం.. ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించింది. ’భారత పోర్టులు అమెరికా దాడులకు ఉపయోగిస్తున్నాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని ’ఎక్స్’ వేదికగా ప్రకటించింది. నిర్దారణ లేని సమాచారం సోషల్ డియాలో పోస్ట్ చేయొద్దని హెచ్చరించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.