శుక్రవారం నాడు భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఒక విద్యాసంస్థ కార్యక్రమంలో మాట్లాడుతూ, న్యూయార్క్ టైమ్స్ తో సహా పశ్చిమదేశాల మీడియా ఎట్లా పక్షపాతంతో ఉందో చెప్పారు. పాకిస్థాన్ కు భారత్ కలిగించిన నష్టాల ఫోటోలు ఎన్నో మీడియాలో వచ్చాయని, భారత్‌కు నష్టం కలిగిందని చెప్పేవారు ఒక్క ఫోటో కూడా చూపించ లేకపోయారని ఆయన గుర్తుచేశారు. భారతదేశ జాతీయవాద నాయకత్వానికి, ప్రపంచపెద్దలకు మధ్య ఉన్న ఒక పోటీని, వైరుధ్యాన్ని ఈ ఫిర్యాదులు సూచిస్తాయి. భారత-పాక్ వైరుధ్యాలలో ప్రపంచం భారత్ వైపు పెద్దగా లేదు అన్నది ఒక వాస్తవం. ఇండియా ఎంత వివాదాలకు దూరంగా ఉండాలనుకున్నా, దాన్ని ఎవరూ పూర్తి విశ్వాసం తో చూడడం లేదు. ఒక పెద్ద మార్కెట్ గా తప్ప, ఒక గౌరవనీయ శక్తిగా పరిగణన మిగలడం లేదు. భారత్ ఆధిక్యాన్ని తగ్గించి చూపడమే కాకుండా, పాకిస్థాన్ సైన్యాధికారిని వైట్ హౌస్ కు పిలిచి మరీ విందు ఇచ్చిన ట్రంప్, ప్రపంచంలోని ఏ దేశాల మధ్య సంధి కుదరాలో, ఎవరు ఎవరి మీద గెలవాలో, ఎవరిది సరైన పక్షమో నిర్ణయించవలసింది తానేనని కుండబద్దలు కొట్టారు.

జాతీయవాదం దాని మంచి దానికుంది కానీ, దానితో పాటు పరిమితులు, బలహీనతలు, దుర్మార్గాలూ కూడా అనేకం ఉన్నాయి. కొన్ని చారిత్రక, పారంపర్య అస్తిత్వాల ఆధారంగా మెజారిటీని ఒక జాతిగా నిర్వచించుకుని, నిర్మించుకుని అది పనిచేస్తుంది. తనలోపలి మైనారిటీలతోనే కాదు, బయటి మెజారిటీ జాతులతో కూడా వైరాన్ని నిర్వహించుకుంటుంది. తాను, ఇతరులు అన్న ద్వంద్వంలో ఎప్పుడూ కొట్టుమిట్టాడుతుంది. ఆధిక్యభావననో, బాధిత భావననో తన ప్రజలలో కలిగిస్తూ ఉంటుంది. తన సమూహం అనుకున్నదాని ప్రయోజనాలను రక్షించడం, పెంపొందించడం పేరుతో, అందులోని ప్రాబల్యశ్రేణుల ప్రయోజనాలను స్థిరపరుస్తుంది. తిరుగులేని అధికారాన్ని సమకూర్చుకుంటుంది. ఆధునిక ప్రపంచంలో, జాతీయవాద ప్రభుత్వాలు, తమ దేశంలోపల ఒక పరిస్థితిని నిర్మించుకుంటాయి, సాపేక్షంగా బలమైన ఇతర జాతీయవాద రాజ్యాలతో బలహీన సంబంధాలలోకి వెళతాయి. .
భారతదేశంలో ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీకి తీవ్రజాతీయవాద(అల్ట్రా నేషనలిస్ట్) పార్టీ అన్న పేరుంది. సాంస్కృతికంగా ‘సనాతన’ జాతీయవాదాన్ని, మెజారిటేరియన్ ఆధిక్యాన్ని బలపరచే ఈ పార్టీ, ఆర్థికంగా ఉదారవాద ఆర్థిక విధానాలు అని పిలిచే ప్రపంచీకరణ ప్రక్రియను అంగీకరించి అమలుజరుపుతుంది. ప్రపంచీకరణలో అన్ని రాజ్యాలు సమానం కావు. బలహీన, వర్ధమాన దేశాల మార్కెట్లను తమకు అందుబాటులోకి తెచ్చుకునేవరకు సమాన ప్రాతిపదికలను చెబుతూ వచ్చే అగ్రరాజ్యాలు, తమ ప్రయోజనాల దగ్గిరికి వచ్చేసరికి, కొత్తవాదనలు తెస్తాయి, అప్పటిదాకా ఖండిస్తూ వచ్చే ప్రాటెక్షనిస్టు చర్యలను తామే అమలుజరుపుతాయి. ఈ వాతావరణంలో, జాతీయవాద పార్టీ పాలనలో భారతదేశం తన ప్రయోజనాలను రక్షించుకుంటూ, తనవంటి దేశాలకు అండగా నిలుస్తూ స్వతంత్ర వైఖరిని ప్రకటిస్తుందని ఆశిస్తాము. ప్రపంచంలో కొన్ని దేశాలు మునుపు, ఇప్పుడు కూడా తీవ్రజాతీయవాదాన్ని అనుసరిస్తూ, అంతర్జాతీయ రంగంలో కూడా తమ సార్వభౌమాధికారాన్ని వక్కాణించడాన్ని ఆ వైఖరిలో భాగంగా పరిగణిస్తూ వస్తున్నాము, కానీ, భారతదేశం సరళి జాతీయవాద ఆదర్శాలకు అనుగుణంగా కాక, వివాదాలకు దూరంగా మెలిగే ఆత్మరక్షణ ధోరణిలో కనిపిస్తోంది. 1990 ల నుంచి ఇట్లాగే ఉంది. దానికది ఏమీ తప్పుకాదు. ఉన్న పరిస్థితులలో మనుగడను కాపాడుకోవడం, దేశప్రయోజనాలను ప్రధానంగా తీసుకుని వివాదాలకు దూరంగా మెలగడం, ఆచరణాత్మక విధానంగా పరిగణిస్తారు. కానీ, ప్రపంచంలో భారత్ ప్రతిష్ఠను పెంచారని భావిస్తున్న నరేంద్రమోదీ హయాం లో కూడా ఈ “ ఆత్మరక్షణ” ధోరణి కొనసాగడం ఆశ్చర్యమే. భారతదేశం తన ప్రస్తుత విదేశాంగ విధానం వెనుక అంతస్సూత్రం ‘ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ ( స్ట్రాటెజిక్ అటానమీ) అని చెప్పుకుంటోంది.
భారతదేశానికి తన ఇరుగుపొరుగుతో, ముఖ్యంగా పాకిస్తాన్‌తో, చైనాతో సమస్యలున్నాయి. ఆ రెండు దేశాలతో వ్యవహరించే తీరులో కూడా తేడాలున్నాయి. పెహల్గామ్ ఘాతుకం తరువాత, భారత్ పాకిస్థాన్ మీద కఠినమైన ప్రతీకారచర్యలు తీసుకుంది. భారత్-పాక్ ద్వంద్వంలో, ఉభయదేశాల ప్రజల మనోభావాలు చారిత్రకంగా పరస్పర శత్రుపూరితంగా రూపుదిద్దుకున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్” సందర్భంగా భారతదేశంలో వ్యక్తమైన భావావేశాలు, ప్రభుత్వ స్పందనల మీద వెల్లువెత్తిన ప్రశంసలు, సైన్యశక్తి మీద పెరిగిన వీరారాధనలు- జాతీయవాద దేశభక్తి తీవ్రతను సూచిస్తాయి. కానీ, అంతర్జాతీయ సమాజం, మీడియా భారతప్రభుత్వ జాతీయావేశాల మీద చన్నీళ్లు చల్లింది. పాకిస్థాన్ కు భారతదేశం కలిగించిన నష్టాన్ని అవి ధ్రువీకరించలేదు, పైగా, భారతదేశం అంగీకరించని నష్టాలను పదే పదే చెబుతూ వచ్చాయి. పాకిస్థానే కాళ్లబేరానికి వస్తే, తాము కాల్పుల విరమణ చేశామని భారత్ చెబుతుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన జోక్యం వల్లనే యుద్ధం ఆగిందని పదే పదే చెప్పసాగారు. భారతదేశం ఎన్ని సార్లు ఖండించినా సరే, ట్రంప్ మాత్రం తగ్గలేదు. శుక్రవారం నాడు భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఒక విద్యాసంస్థ కార్యక్రమంలో మాట్లాడుతూ, న్యూయార్క్ టైమ్స్ తో సహా పశ్చిమదేశాల మీడియా ఎట్లా పక్షపాతంతో ఉందో చెప్పారు. పాకిస్థాన్ కు భారత్ కలిగించిన నష్టాల ఫోటోలు ఎన్నో మీడియాలో వచ్చాయని, భారత్‌కు నష్టం కలిగిందని చెప్పేవారు ఒక్క ఫోటో కూడా చూపించలేకపోయారని ఆయన గుర్తుచేశారు. భారతదేశ జాతీయవాద నాయకత్వానికి, ప్రపంచపెద్దలకు మధ్య ఉన్న ఒక పోటీని, వైరుధ్యాన్ని ఈ ఫిర్యాదులు సూచిస్తాయి. భారత-పాక్ వైరుధ్యాలలో ప్రపంచం భారత్ వైపు పెద్దగా లేదు అన్నది ఒక వాస్తవం. ఇండియా ఎంత వివాదాలకు దూరంగా ఉండాలనుకున్నా, దాన్ని ఎవరూ పూర్తి విశ్వాసం తో చూడడం లేదు. ఒక పెద్ద మార్కెట్ గా తప్ప, ఒక గౌరవనీయ శక్తిగా పరిగణన మిగలడం లేదు. భారత్ ఆధిక్యాన్ని తగ్గించి చూపడమే కాకుండా, పాకిస్థాన్ సైన్యాధికారిని వైట్ హౌస్ కు పిలిచి మరీ విందు ఇచ్చిన ట్రంప్, ప్రపంచంలోని ఏ దేశాల మధ్య సంధి కుదరాలో, ఎవరు ఎవరి మీద గెలవాలో, ఎవరిది సరైన పక్షమో నిర్ణయించవలసింది తానేనని కుండబద్దలు కొట్టారు.
మనతో వాణిజ్య అవసరాలు, సహకార అవసరాలు ఉన్నచిన్నదేశాలు, ఘనస్వాగతాలు ఇస్తాయి, పౌరపురస్కారాలు అందిస్తాయి. అక్కడ మనకు కాంట్రాక్టులు లభిస్తాయి. అక్కడ ఉండిన వలసభారతీయులకు మనం ఓసిఐ కార్డులు ఇస్తాము. బాగానే ఉంటుంది. కానీ, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ తో ఖచ్చితంగా నిలబడిన ఒక్క దేశం కూడా లేకపోవడాన్నిఎట్లా అర్థం చేసుకోవాలి? మన దేశంతో వాణిజ్యఅవసరాలున్న టర్కీ అవసరమైనప్పుడు పాకిస్థాన్‌తో నిలబడింది. అట్లా భారత్ తో ఎవరు నిలబడ్డారు? చాటుగా, నర్మగర్భంగా సమర్థనలు ఇవ్వడం వేరు. పాకిస్థాన్‌కే తన ఓటు అన్నట్టు అమెరికా బాహాటంగా ఎందుకు వ్యవహరించింది? అసలు దక్షిణాసియాలో ఏ ఒక్క దేశంతోనూ భారతదేశానికి మంచి పొరుగు సంబంధాలు ఎందుకు సాధ్యం కావడం లేదు? ఒక ఆత్మవిశ్వాసంతో, రాజకీయ నిబద్ధతతో కూడిన విదేశాంగ విధానం లేకపోవడమే ఇందుకు కారణం కాదా? అన్నిటికీ దూరంగా ఉండడం, అన్నది ఎవరికీ కానీ వారముగా మనల్ని మార్చివేయడం లేదా?
బ్రెజిల్‌లో ‘ బ్రిక్స్’ సదస్సు జరుగుతుండగానే, బ్రిక్స్‌తో ఉంటే సుంకాలు పెంచుతా అన్నారు ట్రంప్. ఆ సదస్సుకు హాజరు అయినవాళ్లనే కాదు, అందులో వ్యవస్థాపక సభ్య దేశమైన భారత్ మీద కూడా ఆయన కొరడా ఝళిపించారు. డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీ గురించి ఆలోచించడమే బ్రిక్స్ చేసిన నేరం. బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఆ విషయంలో పట్టుదలగా ఉన్నాయి. భారతదేశం మాత్రం ప్రత్యామ్నాయ కరెన్సీ విషయంలో ఆసక్తిగా లేదు. అట్లాగని, డాలర్ ను వ్యతిరేకించే లేదా డాలర్‌తో నిమిత్తం లేని వాణిజ్యం నుంచి భారత్ లాభపడలేదని కాదు. రష్యా తో రూబుల్-రూపీ వ్యాపారం చేసినప్పడూ, మొదటి గల్ఫ్ యుద్ధం తరువాత, ఇరాక్‌మీద ఆంక్షలు విధించిన కాలంలోను, గత రెండు దశాబ్దాలుగా ఇరాన్ మీద ఆంక్షలు ఉన్న కాలంలోను, వస్తుమార్పిడి పద్ధతిలో, డాలర్‌ను దాటవేసిన లాభదాయకమైన వాణిజ్యాన్ని భారత్ అనుభవించింది. అగ్రరాజ్యానికి ఆగ్రహం వస్తుందని తెలిసీనా, ద్వైపాక్షిక సంబంధాల పేరుతో దాన్ని కొనసాగించింది. కానీ, డాలర్ రహిత వాణిజ్యాన్ని ఒక రాజకీయార్థిక ప్రతిపాదనగా మూడో ప్రపంచదేశాలు ముందుకు తీసుకువస్తే, ఆ ఉద్యమంలో పాల్గొనడానికి మాత్రం భారత్ ధైర్యం చేయడం లేదు. బ్రిక్స్ గురించి ట్రంప్ బెదిరింపుల మీద భారత్ ఎటువంటి స్పందనలూ ఇవ్వలేదు. భారత్ వాణిజ్యంపై ట్రంప్ విధిస్తున్న సుంకాల విషయంలో కూడా, సాధ్యమైనంత అనుయయంగా ఉభయతారకమైన ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నది.
మరి అలీనోద్యమం కాలంలో, ప్రపంచంలో ఎక్కడ ఏ స్వాతంత్ర్యపోరాటం జరిగినా, జాతివిముక్తి ఉద్యమం జరిగినా, వివక్షలు కొనసాగుతున్నా, భారత్ వాటిని ఖండించడంలో ముందుండేది. అది కేవలం, సోవియట్ యూనియన్ అండ చూసుకుని మాత్రమేనా? ఏకధ్రువ ప్రపంచం ఏర్పడుతున్న సూచనలు కనబడగానే, మనం మారిపోయామా? మొదటి గల్ఫ్ యుద్ధం సందర్భంగా, ఇరాక్ నుంచి, కువాయిట్ నుంచి భారతీయులందరినీ క్షేమంగా వెనక్కు తీసుకురావడానికి దౌత్యస్నేహాన్ని ఉపయోగించుకుని, ఆ వెనువెంటనే, అమెరికా విమానాలకు ఇంధనం నింపుకునే వెసులుబాటు కల్పించిన చరిత్ర ఆనాటి ప్రభుత్వాలది. సాంప్రదాయ మైత్రిని చెప్పుకుంటూ, ఇరాన్ నుంచి చవుకగా చమురును సంపాదిస్తూ, ఆ దేశానికి కష్టం వచ్చినప్పుడు, మాటసాయం కూడా మనం చేయలేకపోయాం. అటు యుక్రెయిన్ విషయంలో రష్యాను ఖండించలేదు, గాజా ఊచకోతలనూ వద్దనలేదు. దేశంలోపల మహా శౌర్యంతో ఏకపాత్రాభినయాలు చేస్తూ, లోకపు కొలువుకూటంలో విదురనీతులూ, సన్నాయినొక్కులూ ప్రసాదిస్తే ఎట్లా? ఇజ్రాయిల్ తో, అమెరికాతో ఎన్నో మొహమాటాలు ఉన్న దేశాలు కూడా ఇరాన్ మీద అమెరికా దాడిని ఖండించాయి. మన మెందుకు ఆ పని చేయలేకపోయాము? ఇది కేవలం తీవ్రజాతీయవాద పాలనలోనే జరుగుతున్నది కాదు, మూడున్నరదశాబ్దాలుగా అన్ని పార్టీల హయాంలోనూ జరుగుతూ వస్తున్నదే. కాకపోతే, దేశభక్తిని, స్వాభిమానాన్ని ఎక్కువగా ఉచ్చరించే పాలకుల కాలంలో కూడా మనం ఎందుకు ‘ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ పేరుతో ‘నొప్పించక తానొవ్వక’ తిరుగుతున్నామన్నదే ప్రశ్న.
మనతో వాణిజ్య అవసరాలు, సహకార అవసరాలు ఉన్నచిన్నదేశాలు, ఘనస్వాగతాలు ఇస్తాయి, పౌరపురస్కారాలు అందిస్తాయి. అక్కడ మనకు కాంట్రాక్టులు లభిస్తాయి. అక్కడ ఉండిన వలసభారతీయులకు మనం ఓసిఐ కార్డులు ఇస్తాము. బాగానే ఉంటుంది. కానీ, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ తో ఖచ్చితంగా నిలబడిన ఒక్క దేశం కూడా లేకపోవడాన్నిఎట్లా అర్థం చేసుకోవాలి? మన దేశంతో వాణిజ్యఅవసరాలున్న టర్కీ అవసరమైనప్పుడు పాకిస్థాన్‌తో నిలబడింది. అట్లా భారత్ తో ఎవరు నిలబడ్డారు? చాటుగా, నర్మగర్భంగా సమర్థనలు ఇవ్వడం వేరు. పాకిస్థాన్‌కే తన ఓటు అన్నట్టు అమెరికా బాహాటంగా ఎందుకు వ్యవహరించింది? అసలు దక్షిణాసియాలో ఏ ఒక్క దేశంతోనూ భారతదేశానికి మంచి పొరుగు సంబంధాలు ఎందుకు సాధ్యం కావడం లేదు? ఒక ఆత్మవిశ్వాసంతో, రాజకీయ నిబద్ధతతో కూడిన విదేశాంగ విధానం లేకపోవడమే ఇందుకు కారణం కాదా? అన్నిటికీ దూరంగా ఉండడం, అన్నది ఎవరికీ కానీ వారముగా మనల్ని మార్చి వేయడం లేదా?
ప్రపంచంలో అనేక దేశాలు, తమ విశ్వాసాల మీద పట్టింపుతో ప్రమాదంతో కూడిన విధానాలను అనుసరిస్తున్నారు. వాళ్ల ప్రజలు కూడా ఆయా దేశాల ప్రభుత్వాల వెంట ఉన్నారు. నిజానికి, ఆ ప్రజలలో ఉన్న మనోభావాలు, సైద్ధాంతిక భావాలే పాలకుల తీరును శాసిస్తున్నాయి. మరి మన దేశ ప్రజలు ఇప్పుడు దేశభక్తితో ఉప్పొంగిపోతున్న స్థితిలో ఉన్నారు, ప్రపంచదేశాలను సవాల్ చేయగలిగితే నాయకులను మరింత గాఢంగా ఆరాధిస్తారు. మరి నేతలు అట్లా ఎందుకు లేరు? పాకిస్థాన్ మీదకే మన ప్రతాపాలను పరిమితం చేయడం ఏమీ జాతీయవాదం? ప్రజలు కూడా, మన నాయకులు ప్రపంచ వీధిలో యాభైయ్యారు అంగుళాల ఛాతీ విప్పార్చుకుని నడవాలని ఎందుకు ఆశించడం లేదు?
ఈ పరిస్థితి భారతదేశ ప్రజల మీద ఎటువంటి ప్రభావం వేస్తుంది? విదేశాంగ విధానంలో సిద్ధాంతాలకు ప్రాధాన్యం ఉండాలా లేదా అన్నది పెద్ద చర్చ. ఇజ్రాయిల్ మీద జాతిహనన ఆరోపణలతో అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లవలసిన అగత్యం దక్షిణాఫ్రికాకు ఏమిటి? బాహుబలి వంటి అమెరికా మీద ప్రతీకార దాడులు చేయగలిగే తెంపరితనం ఇరాన్‌కు ఏమిటి? అమెరికా మీద ఆధారపడకుండా, సొంత సైనికశక్తిని పెంచుకోవాలని మాట్లాడగలిగే ధైర్యం ఫ్రాన్స్‌కు ఎట్లా వచ్చింది? అమెరికా వెలివేతతో ఒంటరి దేశంగా అణగారిపోతున్నప్పటికీ క్యూబాకు పశ్చిమాసియా యుద్ధాలలో వైఖరులు తీసుకోవలసిన అవసరం ఏమిటి? ప్రపంచంలో అనేక దేశాలు, తమ విశ్వాసాల మీద పట్టింపుతో ప్రమాదంతో కూడిన విధానాలను అనుసరిస్తున్నారు. వాళ్ల ప్రజలు కూడా ఆయా దేశాల ప్రభుత్వాల వెంట ఉన్నారు. నిజానికి, ఆ ప్రజలలో ఉన్న మనోభావాలు, సైద్ధాంతిక భావాలే పాలకుల తీరును శాసిస్తున్నాయి. మరి మన దేశ ప్రజలు ఇప్పుడు దేశభక్తితో ఉప్పొంగిపోతున్న స్థితిలో ఉన్నారు, ప్రపంచదేశాలను సవాల్ చేయగలిగితే నాయకులను మరింత గాఢంగా ఆరాధిస్తారు. మరి నేతలు అట్లా ఎందుకు లేరు? పాకిస్థాన్ మీదకే మన ప్రతాపాలను పరిమితం చేయడం ఏమీ జాతీయవాదం? ప్రజలు కూడా, మన నాయకులు ప్రపంచ వీధిలో యాభైయ్యారు అంగుళాల ఛాతీ విప్పార్చుకుని నడవాలని ఎందుకు ఆశించడం లేదు?
యాభై ఏళ్ల కింద, బయటి ప్రపంచానికి విముక్తి ఉద్యమాల సమర్థకురాలిగా ఇండియా కనిపిస్తున్నప్పుడు, దేశంలోపల ప్రజల ఆకాంక్షలను అణచివేస్తూ దుష్పరిపాలన అందిస్తున్నది. ఆ వైరుధ్యాన్ని టంకశాల అశోక్ “అలీనభుజంగాలు” అన్న కవితలో ప్రభావవంతంగా నిలదీశారు. “బయటి ప్రపంచానికి నువ్వు ఏమైనప్పటికీ, ఇంట్లో మాత్రం నువ్వు హీనమైన, క్రూరమైన దానివే” అని ఆ కవిత అభిశంసిస్తుంది. ఇప్పుడు ఆ విమర్శ తలకిందులు కావలసివస్తుంది. దేశీయంగా దుష్పరిణామాలకు లోటేమీ లేదు, మరిన్ని కోరలు కత్తులు మొలిచాయి. బయటి ప్రపంచానికి ప్రదర్శన ఉదాత్త మొహమూ ఇప్పుడు లేదు. కాకపోతే, లోపలి, బయటి మొహాలను ఖాతరు చేయకుండా నేతల భక్తి పారవశ్యంలో తరించే సమాజం రూపొందింది. అశోక్ తరహాలో ఇప్పుడు నిలదీయాలంటే, “ఇంట్లో నువ్వెంత వీరుడివైనా బయట మాత్రం భీరుడివే” అని అనాలి. ఇంట్లోనే, ఇంట్లో మాత్రమే పల్లకిమోత!




