– ట్రంప్‌నకు తలొగ్గిన ప్రధాని మోదీ
– మరోమారు విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ
భోపాల్,ఫిబ్రవరి 24: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల దాడి చేశారు. మోదీ రాజీపడ్డారని, అమెరికా ఒత్తిడికి తలవంచారని ఆరోపించారు. భోపాల్‌లో మంగళవారం జరిగిన కాంగ్రెస్ కిసాన్ మహాచౌపాల్ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశాన్ని అమ్మేశారని, భారతీయుల డాటాను అమెరికా చేతిలో పెట్టారని మోదీని విమర్శించారు. ’వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తులతో ముడిపడిన కారణంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం నాలుగు నెలలుగా నిలిచిపోయింది. పార్లమెంటు ప్రసంగంలో కేవలం ఆర్మీ మాజీ చీఫ్ నవరణెళి గురించే నేను మాట్లాడలేదు. నా ప్రసంగం పూర్తికాగానే సొంత మంత్రులను కూడా సంప్రదించ కుండా మోదీ ట్రంప్‌తో మాట్లాడారు. మహిళా ఎంపీలు దాడి చేయాలనుకున్నారంటూ అబద్దాలు చెప్పారు. దానికి బదులుగా అమెరికాతో డీల్‌కు రెడీగా ఉన్నట్టు ఆయన సూటిగా చెప్పి ఉండవచ్చు. మోదీ కళ్లలో భయం స్పష్టంగా కనిపించింది’ అని రాహుల్ అన్నారు.అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ఆదేశంతో ట్రేడ్ ఒప్పందాలను వదులుకోవాలని ఇతర దేశాలు నిర్ణయం తీసుకుంటే, మోదీ మాత్రం మౌనంగా ఉండిపోయారని రాహుల్ విమర్శించారు. ’ఇదే వేదిక నుంచి మోదీని సవాలు చేస్తున్నాను. డీల్‌పై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. ట్రంప్ ఒత్తిడి కారణంగానే డీల్‌ను మోదీ రద్దు చేసుకున్నారు. భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశం. డాటా కూడా పెద్దదే. కానీ మోదీ మన డాటాను అమెరికాకు ఇచ్చేశారు. ఆయన ద ఒత్తిడి లేకపోతే ఆ పని చేసేవారు కాదు. తన ప్రతిష్ట, రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు దేశాన్ని ఆయన అమ్మేశారు’ అని మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




