– రాయబార కార్యాలయంలో విక్రమ్ మిస్రీ సంతాపం
న్యూదిల్లీ, మార్చి 5: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారత్ సంతాపం తెలిపింది. ఈ మేరకు దిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ భారత్ తరఫున సంతాప సందేశాన్ని రాశారు. అనంతరం ఇరాన్ రాయబారితో మిస్రీ మాట్లాడారు. ప్రస్తుతం ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు. ఇటీవల ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు దాడిచేసి ఆ దేశపు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చాయి. దాంతో పొరుగు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై, ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్ధరిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రపంచదేశాలకు చమురు సరఫరాలో జీవనాడి లాంటి హార్ముజ్ జలసంధిని మూసివేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


