కాంగ్రెస్ లోకి కొత్తగూడెం స్వతంత్ర కార్పొరేటర్లు

ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం  కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలోని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో 1వ డివిజన్ కార్పొరేటర్ సీరపు సుగుణ, 13వ డివిజన్ కార్పొరేటర్ తలుగు శాంతా, 34వ డివిజన్ కార్పొరేటర్ బట్టు విజయలక్ష్మి, 42వ డివిజన్ కార్పొరేటర్ దున్నపోతుల మణి, 48వ డివిజన్ కార్పొరేటర్ ధర్మసోత్ నరేష్ ఉన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు,  ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు  స్వతంత్ర కార్పొరేటర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు  పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *