-టీవీ ఛానల్ జర్నలిస్టుల అరెస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14: రాష్ట్రంలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్తలు ప్రసారం చేసిన కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు దూకుడు పెంచారు. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఓ ఛానల్ ఇన్‌పుట్ ఎడిటర్‌తో పాటు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేశారు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుండగా ఇన్‌పుట్ ఎడిటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మహిళా ఐఏఎస్‌ను కించపరిచే విధంగా 44 యూట్యూబ్ ఛానల్స్ కథనాలు ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఆయా యూట్యూబ్ ఛానళ్లపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఛానల్స్ బాధ్యులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు సీసీఎస్ పోలీసుల సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పలువురిని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసుల దూకుడుతో పలువురు యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. కాగా, సీఎం ఫొటో మార్ఫింగ్, మహిళా ఐఏఎస్‌పై అసభ్యకర కథనాలపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు 8 మంది సభ్యులతో దీనిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ పర్యవేక్షణలో ఈ బృందం పనిచేస్తోంది. దర్యాప్తు వేగంగా పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు మహిళా అధికారిపై అసభ్యకర కథనాలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్లు కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యాయి. ఇలాంటి వార్తలు అధికారుల మనోభావాలను దెబ్బతీస్తాయని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.