– వృద్ధులకే కాదు.. యువతకూ తప్పని ముప్పు
– భారత్‌లో పెరుగుతున్న కేసులు
– నేడు ప్రపంచ పార్కిన్సన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: చేతులు వణకడం, నడకలో తడబాటు, మతిమరుపు.. ఇవన్నీ వృద్ధాప్య లక్షణాలని సరిపెట్టుకుంటే పొరపాటే. ఇది ప్రమాదకరమైన పార్కిన్సన్స్ వ్యాధి కావచ్చు. ఒకప్పుడు అరవై ఏళ్లు దాటిన వారిలోనే కనిపించే ఈ నాడీ సంబంధిత సమస్య ఇప్పుడు దేశంలో యువతను కూడా కలవరపెడుతోంది. మారుతున్న జీవనశైలి, పర్యావరణ కాలుష్యం ఈ వ్యాధి విస్తరణకు ఆజ్యం పోస్తున్నాయి.
వణుకు పుట్టిస్తున్న గణాంకాలు
గతంతో పోలిస్తే ఈ వ్యాధి వ్యాప్తి ఆందోళనకరంగా పెరుగుతోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2019 నాటికి సుమారు 85 లక్షల (8.5 మిలియన్లు) మంది ఈ వ్యాధి బారిన పడగా 2050 నాటికి ఈ సంఖ్య ఏకంగా 2.5 కోట్లకు (25 మిలియన్లు) చేరుతుందని అంచనా. ప్రస్తుతం భారత్‌లో సుమారు 12 లక్షల (1.2 మిలియన్లు) మంది బాధితులు ఉన్నారు. రాబోయే అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మెదడు సంబంధిత వ్యాధుల్లో పార్కిన్సన్స్ రెండవ స్థానానికి చేరే అవకాశం ఉంది. వృద్ధాప్యంతోపాటు పెరుగుతున్న వాయు కాలుష్యం, క్రిమిసంహారకాల అధిక వినియోగం, వేగంగా జరుగుతున్న పారిశ్రామికీకరణ, మారుతున్న జీవనశైలి ఈ వ్యాధికి ఆజ్యం పోస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, హెల్త్‌కేర్ హబ్ అయిన హైదరాబాద్‌లోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నగర జీవనశైలి, కాలుష్యం, ఒత్తిడి వంటి అంశాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో నగరవాసులకు వ్యాధి లక్షణాలపై అవగాహన ఉండటం, అందుబాటులో ఉన్న అధునాతన చికిత్సా విధానాలను సద్వినియోగం చేసుకోవడం ఎంతో అవసరమని బంజారాహిల్స్‌లోని రెనోవా సెంచరీ హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ లలిత పిడపర్తి చెబుతున్నారు.
అసలు పార్కిన్సన్స్ అంటే ఏమిటి?
మెదడులోని కణాల నుంచి విడుదలయ్యే డోపమైన్ అనే రసాయనం తగ్గడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఇది కండరాల కదలికలను నియంత్రించే వ్యవస్థను దెబ్బతీస్తుంది. తొలినాళ్లలో కేవలం చేతి వణుకుతో మొదలై క్రమంగా నడక, మాట, జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది.
వ్యాధి లక్షణాలు :
1.శారీరక కదలికలకు సంబంధించినవి (మోటార్ సింప్టమ్స్) వణుకు, శరీర కదలికలు నెమ్మదించడం, కండరాలు బిగుతుగా ఉండటం, నడకలో అసమతుల్యత, మింగడంలో ఇబ్బంది
2.ఇతర అంతర్గత లక్షణాలు (నాన్ మోటార్ సింప్టమ్స్) జ్ఞాపకశక్తి తగ్గడం, మానసిక సమస్యలుచ, నిద్రలో ఇబ్బందులు, జీర్ణకోశ సమస్యలు, వాసన కోల్పోవడం, అలసట, అకస్మికంగా రక్తపోటు పడిపోవడం

ఎవరికి ముప్పు ఎక్కువ?
సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో. వంశపారంపర్యం. మహిళలతో పోలిస్తే పురుషులే ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువ. పర్యావరణ కారకాలు కూడా కారణం.
వ్యాధి నిర్ధారణ :
కేవలం ఒకే ఒక్క రక్త పరీక్ష ద్వారా నిర్ధారించడం సాధ్యం కాదు. దీనికి వైద్యుల క్లినికల్ పరిశీలన, అత్యాధునిక స్కానింగ్‌లు ఎంతో కీలకం. న్యూరాలజికల్ పరీక్ష, స్కానింగ్‌లు (ఎమ్మారై, పీఈటీ లేక డాట్ స్కాన్స్), రక్త పరీక్షలు, జన్యు పరీక్షలు
వ్యాధికి చికిత్స :
పార్కిన్సన్స్‌కు శాశ్వత పరిష్కారం లేకపోయినా అధునాతన వైద్య చికిత్సలతో లక్షణాలను అదుపు చేయవచ్చు. రోగి ఇతరులపై ఆధారపడకుండా తన పనులు తాను చేసుకునేలా చేయడమే ఈ చికిత్సల ప్రధాన లక్ష్యం.
1. ఔషధాల వినియోగం : మెదడులో తగ్గిపోయిన డోపమైన్ స్థాయిలను పెంచడం లేదా డోపమైన్ తరహాలోనే పనిచేసేలా చేయడం ఈ మందుల పని.
2. సపోర్టివ్ థెరపీలు : మందులతోపాటు ఇవి రోగి జీవన ప్రమాణాలను పెంచుతాయి. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ.
3. అధునాతన చికిత్సలు : కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా మందులకు స్పందన తగ్గినప్పుడు ఆధునిక విధానాలు ఉపయోగపడతాయి.
డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్): దీనిని ఒక రకమైన మెదడు పేస్‌మేకర్ అని పిలవవచ్చు. ఇందులో మెదడులోని నిర్దిష్ట భాగాల్లో చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చి గుండె దగ్గర ఉండే ఒక పరికరానికి కలుపుతారు. ఇది మెదడులోని అసాధారణ సంకేతాలను క్రమబద్ధీకరించి వణుకును నియంత్రిస్తుంది. ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ (ఎమ్మార్‌జీ ఎఫ్‌యూఎస్-ఎ): ఇది అత్యంత ఆధునికమైన, కోత లేని చికిత్స. ఎంఆరఐ మార్గదర్శకత్వంలో శక్తివంతమైన అల్ట్రాసౌండ్ తరంగాలను పంపి వణుకుకు కారణమయ్యే మెదడు కణాలను సరిచేస్తారు. ఇది త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

నివారణ సాధ్యమేనా?
వ్యాధిని పూర్తిగా నివారించే నిర్దిష్ట మార్గం లేనప్పటికీ మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు. వ్యాయామమే మహా ఔషధం. ఆరోగ్యకర జీవనశైలి, కాలుష్యానికి దూరంగా ఉండటం.
ముందడుగు వేద్దాం.. అవగాహనతోనే విజయం సాధిద్దాం 

దేశంలో పార్కిన్సన్స్ కేసులు శరవేగంగా పెరుగుతున్న తరుణంలో దీనిపై పోరాడటానికి కేవలం వైద్యం మాత్రమే సరిపోదు. సామాజిక అవగాహన, కుటుంబ సభ్యుల మద్దతు కూడా అంతే ముఖ్యం. దీనిపై విస్తృత అవగాహన కల్పించాలి. ముందస్తు సంప్రదింపులే రక్ష. ఆధునిక చికిత్సల లభ్యత ఉంది. వణుకు లేదా కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. ముందస్తు నిర్ధారణ, నిపుణుల సమన్వయంతో కూడిన చికిత్స(మల్టీ డిసిప్లినరీ అప్రోచ్) ద్వారా బాధితులు ఎంతో నాణ్యమైన జీవితాన్ని గడపవచ్చు అని డాక్టర్ లలిత తెలిపారు.
—————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.