– అధికారులు అప్రమత్తంగా వుండాలి
– కొత్త సబ్‌స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు
– ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: యాసంగి పంటల సీజన్‌తో పాటు వేసవి ప్రభావం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్వి, నియోగం గణనీయంగా పెరుగుతుంది. 19 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌నూ సమర్థంగా తట్టుకునే నెట్‌వర్క్ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విద్యుత్ శాఖ ఉన్నదా అధికారులను ఆదేశించారు. వేసవికాలం, యాసంగి సాగు సీజన్ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అసెంబ్లీ ఆవరణలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం మార్చి 20న నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లు కాగా, ఈ సంవత్సరం మార్చి 2న 17,606 మెగావాట్ల డిమాండ్‌ను చేరుకుని గత రికార్డును సమం చేసింది. అనంతరం రోజురోజుకీ పెరుగుతున్న డిమాండ్, మార్చి 13న 18,228 మెగావాట్లకు చేరి, 341.08 మిలియన్ యూనిట్ల వినియోగంతో కొత్త రికార్డును సృష్టించిందనీ సమావేశంలో వివరించారు. డిమాండ్ భారీగా పెరిగినా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా, ఓవర్‌లోడింగ్ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ సంస్థలు సమర్థంగా వ్యవహరిం చాయని పేర్కొన్నారు. ఈ కృషికి విద్యుత్ సిబ్బందిని అభినందించారు. అలాగే, విద్యుత్ డిమాండ్ 19 వేల మెగావాట్లకు మించినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త సబ్‌స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. యాసంగి పంటల సీజన్ మరియు వేసవి కాలం ముగిసేంతవరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రైతాంగానికి, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని రంగాల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, తెలంగాణ డిస్కమ్‌ల సీఎండీలు ముషారఫ్ ఫరూఖీ, జితేష్ వి. పాటిల్, వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




