– ఫలితాలపై బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విశ్లేషణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల నుండి మంచి ఆదరణ ల భించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ వోట్ల శాతం గణనీయంగా పెరిగిందని తెలిపారు. గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం సాధిం చ డం పార్టీ బలోపేతానికి సంకేతమని పేర్కొ న్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఇతర పార్టీ లు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారన్నారు. భైంసాలో బీజేపీ విజయం సాధించకుండా చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 మున్సిపాలిటీల్లో బీజేపీ గట్టిపోటీ ఇచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరుగుతున్నదానికి నిదర్శనమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టు కుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఫలితాలు బీజేపీకి ఉత్సాహాన్ని నింపాయని రామచందర్ రావు న్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




