యాదగిరిగుట్టలో పెరిగిన భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ముందుగా స్వామి వారి దర్శనం చేసుకుని అనంతరం కొండపైన కార్తీక దీపాలు వెలిగించారు. అనేమకమంది భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కార్తీకమాసం సందర్భంగా ప్రతిరోజూ ఆరు విడతలుగా సత్యనారాయణ స్వామి వ్రతాలను దేవస్థానం వారు నిర్వహిస్తుండడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతాలు జరుపు కుంటున్నారు కార్తీక మాసంలో ప్రతి శని, ఆదివారాలలో సెలవు రోజులు కావడంతో యాదగిరిగుట్టకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *