వ‌రుస సెల‌వులు.. గుట్ట‌కు పెరిగిన భ‌క్తులు

– స‌ర్ద్వ ద‌ర్శ‌నానికి మూడు గంట‌ల స‌మ‌యం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర,  డిసెంబర్ 26: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవు రోజులు కావడంతో శుక్రవారం స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ మ‌రింత‌ పెరిగే  అవ‌కాశ‌ముండ‌డంతో భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.శుక్రవారం భక్తుల రద్దీ అధికంగా ఉన్న కారణంగా కొండపైన ఎస్పీఎఫ్ సిబ్బ‌దితో పాటు స్థానిక పోలీసులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ సిబ్బందితో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేసినట్టు ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, యాదగిరిగుట్ట టౌన్ సి.ఐ. భాస్కర్ తెలిపారు.స్వామివారి సర్వదర్శనానికి మూడు గంటలకు సమయం పట్టగా ప్రత్యేక దర్శనానికి సుమారు గంట సమయం పడుతున్న‌ది. కొండపైన ఆలయ ప్రాంగణంలో, పురవీధులలో, ప్రసాద కౌంటర్ల సమీపంలో, కొండ కింద కళ్యాణ కట్ట, సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఎటు చూసినా భక్త సందోహం కనిపించింది.

అమ్మవారికి ఊంజల్ సేవ                         

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అమ్మవారి ఊంజల్ సేవను అద్దాల‌ మండ‌పంలో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నిత్య పూజలతోపాటు సంప్రదాయ పర్వాలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులను ఆస్థానపరంగా పూజించిన తదుపరి సాయంత్రం వేళ ఆండాళ్ అమ్మవారిని వజ్ర వైఢూర్యాలతో, సుగంధ పూలతో ప్రత్యేకంగా అలంకరించి ఊంజల్ సేవను నిర్వహించారు. ముత్యాల పల్లకిపై అలంకృత అయిన అమ్మవారిని ఆరాధిస్తూ పూజారులు హారతి నివేదించారు. ఆస్థాన విద్వాంసులు మేళతాళాలతో సంకీర్తనలు పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *