రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత

– ఉత్తరాది నుంచి శీతలగా తాకిడి
– పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ‌జారీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌12: ‌రాష్ట్ర వ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది.ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలుల వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వాతావరణ శాఖ అధికారి తెలిపారు. ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో చలి గాలుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. రెండ్రోజుల పాటు శీతల, అతి శీతల పవనాలు వీచే అవకాశం ఉన్నందున ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. ఎల్లుండి నుంచి పొగ మంచు పెరిగే అవకాశం ఉందన్నారు. శీతల గాలులు, పొగ మంచు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం వివరించింది. పొగ మంచు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. శీతల గాలులతోపాటు పొగ మంచు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ కేంద్రం సూచించింది.ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. దాంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ‌జారీ చేసింది. శనివారం.. ఆదిలాబాద్‌, ‌కొమరంభీమ్‌ ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు సైతం ఎల్లో అలర్ట్ ‌జారీ చేసింది. 14వ తేదీ.. ఆదివారం.. రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో చూస్తే రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల గాలులు ఉత్తర ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉందని పేర్కొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *