– బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి
– దివ్యాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొల్లి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12: దివ్యాంగుల సహాయ ఉపకరణాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో దివ్యాంగుల ఉద్యోగ, ఉపాది పై మాట్లాడిన సీఎం ఇతర సమస్యలు దివ్యాంగుల పెన్క్షన్ పెంపు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ పై స్పందించకపోవడం బాధాకరమని అఖిల భారత దివ్యంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రులు దివ్యాంగుల పెన్క్షన్ పెంపు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, ఉపాధి అనే మౌలిక హక్కుపై పట్టించుకోలేదు. ఇకనైనా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం అమలుకు ముందుకు రావాలన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం – 2016 ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగుల కోసం ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలి. అలాగే యూనిఫామ్ సర్వీసుల్లో 4% రిజర్వేషన్ను పూర్తిస్థాయిలో అమలు చేయాలి. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా 4% రిజర్వేషన్ ను అమలు చేసి దివ్యాంగులకు సమానమైన ఉద్యోగ- ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వం దివ్యాంగుల హక్కుల చట్టం ఆత్మను గుర్తించి దివ్యాంగుల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





