బద్నాం చేయడమే కాంగ్రెస్, బిజెపిల లక్ష్యం
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 09: మరో దేశంలో అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకి బ్రహ్మరథం పట్టేవారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రయోజనాలు ప్రజలకు తెలుసని, కేసీఆర్‌ను బద్నాం చేయడమే భాజపా, కాంగ్రెస్ అజెండా అని విమర్శించారు. కాళేశ్వరం అంశంపై ఏర్పాటు చేసిన సిట్ ఎదుట సోమవారం మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కాళేశ్వరం గురించి విూడియాతో మాట్లాడారు. మరో దేశంలో ఈ ప్రాజెక్టును నిర్మించి ఉంటే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేదని, మన దేశంలో కాంగ్రెస్, భాజపా రాజకీయాలకు పావుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు అనేది వ్యక్తిగత నిర్ణయం కాదు. మంత్రివర్గ ఆమోదంతోనే నిర్మాణం చేపట్టామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం.. ఆచరణలో పెట్టే బాధ్యత అధికారులు, యంత్రాంగంపై ఉంటుంది.. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు.. కాళేశ్వరం అంశంలో దాచాల్సిందేవిూ లేదు అని వివరించారు. అసత్య ఆరోపణలు చేస్తూ నోటీసులతో వేధిస్తున్నారుని, కమిషన్ ముందు హరీశ్‌రావు పూర్తి అంశాలు వివరించారని, ఇక కేసీఆర్ కొత్తగా చెప్పేదేవిూ ఉండదని అన్నారు. రాష్టాన్న్రి సర్వనాశనం చేసే విధ్వంసకర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే వారెవరూ భారాసలో లేరంటూ విూడియా మేనేజ్‌మెంట్‌తో ప్రధాని మోదీ దృష్టిలో పడేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.





