ప్రభుత్వ పథకాల అమలు బాధ్యత మీదే

‌- శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులతో సిఎం రేవంత్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ, ఆధిపత్యాన్ని సహించబోరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్‌ 1 ‌పరీక్షలను నిర్వహించి.. నియామక పత్రాలు అందించామన్నారు. గ్రూప్‌ 1, 2 ఉద్యోగుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకున్నామని కోర్టుల్లో లీగల్‌ ‌లిటిగేషన్‌ ‌పెట్టారని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క తప్పు కూడా చేయలేదని అన్నారు. బాగా చదువుకున్న వాళ్లను టీజీపీఎస్సీలో నియమించాం. అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించాం. రంతా శిక్షణ పూర్తి చేసుకొని ఉద్యోగాల్లో చేరుతున్నారు. ప్రభుత్వం మిమ్మల్నే రాష్ట్ర ప్రతినిధులుగా భావిస్తోంది.  ద్వారానే ప్రభుత్వ పథకాలు అమలవుతాయి. మేం ఎన్ని పాలసీలు చేసినా.. దాని అమల్లో రే చాలా ముఖ్యం. బాధ్యతాయుతమైన పదవుల్లో చేరుతున్నారు. ఉద్యోగవిరమణ రోజు వరకు ఇదే స్ఫూర్తితో పని చేయాలి‘ అని దిశానిర్దేశర చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు శిక్షణ పూర్తి చేసుకున్న 271 మంది గ్రూప్‌-1, 171 ‌మంది గ్రూప్‌-2 అధికారులు, 51 మంది మిలిటరీ ఇంజినీరింగ్‌ ‌సర్వీస్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *