కాలుష్య నివారణకు ఈవీ పాలసీ అమలు

– ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
– ఈవీల ఛార్జింగ్‌ ‌స్టేషన్ల పెంపునకు చర్యలు
– అసెంబ్లీలో మంత్రి పొన్నం వెల్లడి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 6: ఎల‌క్ట్రిక్ వాహ‌నాల (ఈవీల‌) బ్యాటరీల సామర్థ్యం పెంపునకు కంపెనీలు చర్యలు చేపట్టాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ఈవీ పాలసీ కింద తయారీదారులు, డీలర్లతో భేటీ ఏర్పాటు చేశామని, ఈవీల‌ ఛార్జింగ్‌ ‌స్టేషన్ల సంఖ్య పెంపునకు చర్యలు ఉంటాయన్నారు.  శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఈ కీలక ప్రకటన చేశారు. ఈవీల రాయితీ అమలుతో రూ.900 కోట్ల పన్ను నష్టం అని, ఉద్యోగులు ఈవీలు కొనుగోలు చేస్తే 20 శాతం తగ్గింపు ఉంటుందని పొన్నం తెలియజేశారు. ఉద్యోగులకు 20 శాతం వరకు తగ్గించాలని కంపెనీలను కోరామని చెప్పారు. ఎంఎన్‌ ‌సి కంపెనీలు ఈవీలు కొనుగోలు చేసేలా విధానం ఉంటుందని, పీఎం-ఈ డ్రైవ్‌ ‌కింద 575 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. కొత్తగా 200కు పైగా ఎల‌క్ట్రిక్ బస్సులు వస్తున్నాయని, వరంగల్‌ ‌లో 100, నిజామాబాద్‌ ‌లో 50 బస్సులు వస్తున్నాయని పేర్కొన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్‌ ‌చేయాలని, స్క్రాప్‌ ‌పాలసీ కింద ప్రోత్సాహం ఇచ్చేలా జీవో తీసుకువచ్చామని పొన్నం స్పష్టం చేశారు. తాము  అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఈవీ పాలసీని తీసుకువచ్చామని, ఈ ఏడాది కాలంలో లక్ష ఈవీలు అమ్ముడయ్యాయని వెల్లడించారు. కాలుష్యం తగ్గాలంటే ఎలక్ట్రిక్‌ ‌వాహనాల వినియోగం పెరగాలని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. ఎలక్ట్రిక్‌ ‌వాహనాలపై కేంద్రం సబ్సిడీ ఇస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా ఇస్తోందా అని ప్రశ్నించారు. ఛార్జింగ్‌ ‌స్టేషన్లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈవీలను తక్కువగా వినియోగిస్తున్నారు.. రాష్ట్రం మొత్తంపై ఆ తరహా వాహనాలు 70 వేలే నడుస్తున్నాయి.. కాలుష్యం తగ్గాలంటే ఈ సంఖ్య పెరగాలి.. రోడ్‌ ‌ట్యాక్స్, ‌వెహికిల్‌ ‌ట్యాక్స్ ‌మినహాయిస్తూ ప్రభుత్వం ప్రోత్సహించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఎలక్ట్రిక్‌ ‌వాహనాలు వాడాలి.. ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాలని వెంకట రమణారెడ్డి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 40శాతం మాత్రమే ఎలక్ట్రిక్‌ ‌వాహనాల వినియోగం ఉందని తెలిపారు. త్రీ వీలర్‌, ‌ఫోర్‌ ‌వీలర్‌ ఎలక్ట్రిక్‌ ‌వాహనాలపై ప్రమోట్‌ ‌చేయాలని సిర్పూర్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబు తెలిపారు. ‘హైదరాబాద్‌ను పొల్యూషన్‌ ‌ఫ్రీ చేయాలంటే ఎలక్ట్రిక్‌ ‌వాహనాలను వాడాలి.. ఎలక్ట్రిక్‌, ‌సోలార్‌ ‌ప్యానెల్‌ ‌తో నడిచే వాహనాలను ప్రోత్సహించాలి.. ఎలక్ట్రిక్‌ ‌వాహనాల వినియోగం పెరగాలంటే పెద్ద ఎత్తున సబ్సిడీలు కల్పించాలి.. పార్కింగ్‌ ‌స్థలాల్లో ఛార్జింగ్‌ ‌స్టేషన్లు ఏర్పాటు చేయాలి.. ఇవీ పాలసీని తీసుకుని వస్తున్నందుకు ధన్యవాదాలు‘ అని ఎమ్మెల్యే అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *