– నిర్బంధ కేంద్రానికి తరలింపు
వాషింగ్టన్, జనవరి 23: మిన్నెసోటాలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఐదేళ్ల చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రీ `స్కూల్ నుండి ఇంటికి వెళుతున్న బాలుడిని అతని తండ్రితో పాటు ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకుని టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు పాఠశాల యాజమాన్యం, న్యాయవాది తెలిపారు. ఈ బాలుడు ఇటీవల మిన్నియాపాలిస్ శివారు ప్రాంతం నుండి ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్న నాలుగవ చిన్నారి కావడం గమనార్హం. బాలుడి పేరు లియామ్ కొనేజో రామోస్ అని, మంగళవారం మధ్యాహ్నం కారు నుండి ఫెడరల్ ఏజెంట్లు చిన్నారిని తీసుకువెళ్లారని కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్స్ సూపరింటెండెంట్ జెనా స్టెన్విక్ విÖడియాకి తెలిపారు. వలసదారులపై చర్యల కోసం చిన్నారులను ఎరగా వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో బాలుని కుటుంబం అమెరికాకు వలస వచ్చిందని, బహిష్కరణకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు జారీ కాలేదని తెలిపారు. ఐదేళ్ల పిల్లాడిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. బాలుడిని హింసాత్మకంగా నేరస్థుడిగా చేర్చనున్నారా అని అధికారులను నిలదీశారు. చిన్నారిని లక్ష్యంగా చేసుకోలేదని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. పిల్లవాడి తండ్రి ఆడ్రియన్ అలెగ్జాండర్ కోనెజో అరియాస్‌ను అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ గురువారం మిన్నియాపాలిస్ నేతలతో మాట్లాడినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. భయంకరమైన కథ విన్నానని, ఆ బాలుడిని అరెస్ట్ చేయకుండా నిర్బంధించారని తరువాత తెలుసుకున్నానని చెప్పారన్నారు. మిన్నెసోటా సమాఖ్య వలసదారులకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. గత ఆరువారాల్లో ఈ ప్రాంతం నుండి సుమారు 3,000మందిని యుఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





