శ్రీశైలంలో అక్రమంగా విద్యుదుత్పత్తి

– నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఏపీ ప్రభుత్వం
– మండిపడ్డ మంత్రి జూపల్లి  కృష్ణారావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వేసవిలో నీటికి కటకట ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్ప‌త్తి చేయొద్దని నిబంధన ఉందని, ట్రయల్స్ చేయొద్దని జీవో కూడా ఉందని,  తాగునీటి  కోసం మాత్రమే వినియోగించాలని సమైక్య రాష్ట్రంలో ఇచ్చిన జీవో స్పష్టంగా ఉందని ఆయ‌న‌ గుర్తు చేశారు. తెలంగాణ హైకోర్టులో గతంలో పిల్ కూడా వేశామని, జస్టిస్ పినాకి ఘోష్ ఇచ్చిన తీర్పు కూడా ఉందని అన్నారు. కరెంటు ఉత్పత్తి చెయ్యడానికి వీలు లేదన్నారు. దొంగతనంగా కరెంటు తీసుకోవాల్సిన ఖర్మ ఏపీకి ఎందుకని నిల‌దీశారు. ధర్నా చేస్తామని చెప్పడంతో పంపింగ్ ఉపసంహరించుకుందన్నారు. పాలమూరు రైతాంగం, ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. నీటి కేటాయింపు అంశం కోర్టులో పెండింగ్ లో ఉందని, 69 శాతం తెలంగాణకు ,31 శాతం ఆంధ్రకు వాటా రావాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం మన రాష్ట్ర హక్కును కాపాడుతుందని, అక్రమంగా నీటిని తరలిస్తే ప్రజల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. మంత్రి జూపల్లి వ్యాఖ్యలతో ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *