జర్నలిస్టుల అరెస్టు అనైతికం

– ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 14: ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభమైన జర్నలిజం పట్ల, జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఓ న్యూస్‌ రిపోర్ట్‌ విషయంలో తలెత్తిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 మంది సభ్యుల స్పెషల్‌ ఇన్వెస్టిగేటివ్‌ టీమ్‌ (సిట్‌) ఇంకా విచారణ జరుపుతూనే ఉందని, ఇంతలోపే ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేసి ఇంటి తలుపులు ధ్వంసం చేసి వారిని అరెస్టు చేయించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. విచారణ పూర్తయ్యాక తప్పొప్పులు పరిశీలించి చర్యలు తీసుకోవాలి కానీ ఇలా ముందుగానే అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి నమ్మకం లేదా లేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా అని ప్రశ్నించారు. అక్రమంగా అరెస్టు చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిష్పక్షపాతంగా ‘సిట్‌’తో విచారణ జరిపించాలని, అంతే తప్ప జర్నలిస్టులను బెదిరించే, భయపెట్టే చర్యలకు పాల్పడకూడదని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *