హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఐహెచ్ఆర్‌సీ) రాష్ట్ర కార్యదర్శిగా నెనావత్ రాంధన్ నాయక్ నియమితులయ్యారు. ఈమేరకు డెన్మార్క్‌లోని అంతర్జాతీయ పరిపాలనా కేంద్రం నుండి ఈనెల 1న ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాంధన్ నాయక్ సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లికి చెందినవారు. గ్రామీణ స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తూ మంచి గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా రాంధన్ నాయక్ తమ ప్రయాణంలో తోడ్పడిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజ సేవకు, ప్రజల హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మహిళలు, బాలలు, ఆదివాసీలు, బలహీనవర్గాల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని, ప్రభుత్వ విభాగాలు, ప్రజల మధ్య సమన్వయం కల్పిస్తూ పారదర్శకమైన విధానంలో సేవలందిస్తానని తెలిపారు. రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణ మరింత బలోపేతం కావడానికి తన వంతు పాత్ర పోషిస్తానని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





