ఐజీపీ (పి&ఎల్)గా గజరావు బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 19:  డిజిపి కార్యాలయంలో ఐజిపి (పి&ఎల్)గా డాక్టర్ గజరావు భూపాల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఐజిపి పోలీస్ వెల్ఫేర్, స్పోర్ట్స్ విభాగాల పూర్తి అదనపు బాధ్యతలను కూడా ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గజరావు భూపాల్ 2008 బ్యాచ్‌కు చెందినవారు. గ‌తంలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. తన 18 ఏళ్ల సర్వీసులో గజరావు భూపాల్ ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ బాధ్యతలను నిర్వహించారు. ప్రారంభంలో భద్రాచలం ఏఎస్పీగా పని చేసిన ఆయన, ఆ తర్వాత వరంగల్ కమాండెంట్‌గా, నెల్లూరు జిల్లా ఎస్పీగా, సీఐడీ విభాగంలో సేవలందించారు. విజయవాడ డీసీపీగా, మంగళగిరి బెటాలియన్ కమాండెంట్‌గా పని చేయడంతో పాటు ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి జిల్లా ఎస్పీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ లో సౌత్ జోన్ డీసీపీగానూ అనంతరం హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీగా క్రైమ్ విభాగం (డిడి) మరియు అడ్మిన్ విభాగాల్లో పనిచేశారు. డిజిపి కార్యాలయంలో డీఐజీ కో-ఆర్డినేషన్‌గా, సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్)గా పని చేస్తూ ఐ జి పి గా డిజిపి కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *