ఎన్నికల అజెండా విస్మరించిన కాంగ్రెస్‌

-‌ రైతుబంధు రూ.12వేలకు కుదింపు
– బడ్జెట్‌లో పెట్టినవి కూడా అమలు చేయరా?
– బడ్జెట్‌పై చర్చలో బిఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఒక్క సీజన్‌ ‌కూడా ఎగ్గొట్టకుండా రైతుబంధు ఇచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎకరానికి రూ.15వేలు ఇస్తామని ఈ ప్రభుత్వం ఎన్నికల అజెండాలో, తొలి బడ్జెట్‌లో ప్రకటించి, తర్వాత దానిని రూ.12 వేలకు తగ్గించారని అన్నారు. మూడో పంటకు రైతుబంధు ఇవ్వాలని అడిగిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఒక సీజన్‌కే ఇస్తున్నారని అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు శాసనసభలో మాట్లాడారు. ఒక సీజన్‌ ‌రైతు భరోసా ఎగ్గొట్టి రుణ మాఫీ చేశామని గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ‘ మొదటి బ్జడెట్‌లో పెట్టినట్లు ఎకరాకు రూ.15వేలు చొప్పున రైతు భరోసా ఇవ్వాలి. బ్జడెట్‌లో పెట్టినవి కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రైతుభరోసా, పంటల బోనస్‌ ఇస్తున్నారు. రెండు బడ్జెట్లలో పెట్టిన పంటల బీమా ఈ బ్జడెట్‌లో మాయమైంది. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని, రెండు బ్జడెట్‌లలో పెట్టారు. ఒక్కసారి కూడా ఇవ్వలేదు. జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌త్వరలోనే ప్రారంభిస్తామని గత బ్జడెట్‌లో చెప్పారు. ఈసారి ఆ ప్రస్తావనే లేదని హరీశ్‌రావు అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌ ‌సర్కారుపై నిప్పులు చెరిగారు. బ్జడెట్‌పై చర్చలో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో లోపాలను ఎండగొట్టారు. కాంగ్రెస్‌ ‌నేతలు ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.15 వేలు రైతుబంధు ఇస్తామని హా ఇచ్చారని, ఈ మేరకు ఎన్నికల అజెండాలో కూడా పెట్టారని హరీష్‌రావు గుర్తుచేశారు. తొలి బ్జడెట్‌లో ప్రకటించి ఆ తర్వాత దాన్ని రూ.12 వేలకు తగ్గించారని మండిపడ్డారు. మా ప్రభుత్వాన్ని మూడో పంటకు కూడా రైతుబంధు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేసిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఒక ఒక పంటకే ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏటా ఒక సీజన్‌కే రైతు భరోసా ఇస్తూ రుణ మాఫీ చేశామని గొప్పలు చెప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మొదటి  బడ్జెట్‌లో పెట్టినట్లు ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. బ్జడెట్‌లో పెట్టినవి కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రైతు భరోసా, పంటల బోనస్‌ ఇస్తున్నారని విమర్శించారు. రెండు బ్జడెట్లలో పెట్టిన పంటల బీమా ఈ బ్జడెట్‌లో మాయమైందన్నారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని కూడా రెండు బడ్జెట్‌లలో పెట్టారని, కానీ ఒక్కసారి కూడా ఇవ్వలేదని చెప్పారు. జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌త్వరలోనే ప్రారంభిస్తామని గత బ్జడెట్‌లో చెప్పారని, ఈసారి బ్జడెట్‌లో ఆ ప్రస్తావనే లేదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ప్రస్తుతం 34 వేల కోట్లుగా ఉన్న ఎక్సైజ్‌ ఆదాయాన్ని రూ.46 వేల కోట్లకు ఎట్లా పెంచుతారని, ఊరూరుకు బార్లు ఓపెన్‌ ‌చేస్తారా అని నిలదీశారు. దాంతో ఎక్సైజ్‌ ‌మంత్రి జూపల్లి కలుగజేసుకుని కాంగ్రెస్‌ ‌హయాంలో రూ.12 వేల కోట్లుగా ఎక్సైజ్‌ ఆదాయాన్ని బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రూ.36 వేల కోట్లు పెంచిందన్నారు. జూపల్లి కలుగజేసుకోవడంపై హరీష్‌రావు అసహనం వ్యక్తం చేశారు. తన ప్రశ్నకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలన్నారు. తాను బ్జడెట్‌పై ప్రశ్నలు అడుగుతున్నానని, ఎక్సైజ్‌ ‌శాఖకు సంబంధించిన స్జబెక్టుపై కాదని చెప్పారు. ఈ సందర్భంగా తలసాని జోక్యం చేసుకుని ప్రభుత్వ తీరును విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *