చర్చలు విఫలమైతే..

– ఇరాన్‌పై మరిన్ని దాడులు
– మరోమారు హెచ్చరించిన ట్రంప్

న్యూయార్క్, ఏప్రిల్ 11: ఇరాన్, అమెరికా దేశాల మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న వేళ శనివారం పాకిస్థాన్‌లో రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్ననర్‌లు ఇప్పటికే పాకిస్థాన్ చేరుకున్నారు. ఇరాన్ ప్రతినిధులు కూడా ఇస్లామాబాద్ వచ్చారు. ఈ చర్చలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయన్న దానిపై యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇరాన్‌తో అమెరికా చర్చలు జరపనున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఇరాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ జలమార్గాలను బ్లాక్ చేయడం తప్ప ఇరాన్ దగ్గర మరో ఆస్త్రం లేదని అన్నారు. హర్మూజ్ జలసంధిని తెరవాలన్నది తమ డిమాండ్ అని తేల్చి చెప్పారు. చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించారు. అత్యుత్తమ ఆయుధాలతో తమ సైన్యం ఇరాన్‌పై దాడి చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఇరాన్ బలగాలు సైనికంగా ఓడిపోయాయన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని స్పష్టం చేశారు. చర్చల ఫలితంతో సంబంధం లేకుండా హర్మూజ్ జలసంధి దానంతట అదే తెరుచుకుంటుందని, త్వరలోనే ఆ జలసంధి తెరుచుకునేలా చేస్తామని అన్నారు. ఇరాన్‌తో చర్చల నేపథ్యంలో ట్రంప్ తన సొంత సోషల్ మీడియా  ది ట్రూత్‌లో ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస పోస్టులు పెడుతున్నారు. శుక్రవారం పెట్టిన ఓ పోస్టులో.. ‘ఇరాన్ యుద్ధం చేసే దానికంటే.. ఫేక్ న్యూస్ డియాను, పబ్లిక్ రిలేషన్స్‌ను హ్యాండిల్ చేయటంలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తోంది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *