అవినీతిని నిరూపిస్తే వెంటనే రాజీనామా

– ప్రజలకు ఎవరేంటో తెలుసు
– నాపై దాడి చేసేందుకు షబ్బీర్‌ ‌కుట్ర
– ఇక ప్రజల్లో ఉండి తేల్చుకుంటా
– నాకేదైనా జరిగితే సిఎం రేవంత్‌దే బాధ్యత
– కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హెచ్చరిక

కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అవినీతిలో కింగ్‌ అన్నారని.. తనపై ఏ ఒక్క అవినీతి బయటపడినా స్పీకర్‌ ‌ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. కామారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఓడిపోయిన కామారెడ్డిలో షబ్బీర్‌ అలీ అన్నీ తానే అంటున్నారని చెప్పుకొచ్చారు. తనను కాంగ్రెస్‌ ‌నుంచి కౌన్సిలర్‌, ‌జడ్పీటీసీ చేశామన్నారని.. ఆయన కామారెడ్డికి చేసిందే లేదని విమర్శించారు. దివంగత మాజీ సీఎం వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన అవకాశంతో తాను కాంగ్రెస్‌ ‌నుంచి గతంలో గెలిచానని ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి ప్రస్తావించారు. ’వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి నా రాజకీయ గురువు. నువ్వు మా తండ్రి వద్ద చేతులు కట్టుకుని నిలబడ్డావ్‌. ‌నువ్వు కట్టిన ఐదు అంతస్తుల భవనానికి మున్సిపల్‌ అనుమతి లేదు. ఈ నియోజకవర్గం నీ సొంతం కాదు. నీవల్లే నేను కాంగ్రెస్‌ ‌నుంచి బయటకు వచ్చాను. అసెంబ్లీలో హుందాగా ఉండాలని మాట్లాడిన నన్ను ఇలా చీప్‌గా మాట్లాడేలా చేశారు. నాపై నిందలేస్తే ఎలా ఉంటుందో ఈ రోజు చూశారు. ఇది ట్రైలర్‌ ‌మాత్రమే.. అసలు సినిమా ముందుంది. నాపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశా. మా వాళ్లు ఎవరూ రావద్దని నేను చెబితే మీరు వేలాదిగా తరలిరావాలని మెసేజ్‌లు పెట్టారు. రేపటి నుంచి గ్రామాలకు వస్తా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా.. బాన్సువాడలో గొడవ జరిగితే మేం మాట్లాడి సద్దుమణిగేలా చేశాం’ అని ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి తెలిపారు. 263 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎలాంటి అక్రమాలు లేవు.. నేను ఒక్క గజం అమ్మినా నిరూపించాలని సవాల్‌ ‌విసిరారు. ’దొంగలెవరో ప్రజలకు తెలుసు. నాకేం జరిగినా సీఎం రేవంత్‌ ‌రెడ్డిదే బాధ్యత. రేపటి నుంచి యుద్ధమే. ఇది సీఎంకు, నాకూ మధ్య యుద్ధం. కలెక్టర్‌ ‌వద్ద కూర్చుందాం. కాలేజీ కమిటీ పేరిట ఎఫ్‌డీలు ఉన్నాయి. అరోరా ఇంజినీరింగ్‌ ‌కాలేజీలో జరిగిన అక్రమాలపై పోరాడాం. తెలంగాణ యూనివర్సిటీని కామారెడ్డిలో పెట్టమని కోరాం. అప్పుడు మంత్రిగా ఉన్న షబ్బీర్‌ అలీ ఏం చేశారు. తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోం. సోమవారం కలెక్టర్‌ ‌వద్దకు వెళ్దాం. నాపై ఒక్క తప్పు తేలినా కాళ్లు పట్టుకుంటా, పదవి వదులుకుంటా. రమ్మంటే సీఎంఓకు వస్తా’ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ కాలేజీ భూముల్లో ఒక్క ఇంచు తేడా వచ్చినా రాజీనామా చేస్తానన్నారు. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న కామారెడ్డిని రణరంగంగా మార్చారని ఫైర్‌ అయ్యారు. తనను చంపుతామని బెదిరించారని.. ఇవాళ అన్నంత‌ప‌ని చేశారని ఆరోపించారు. తాను పిలిస్తే వేలమంది రోడ్లదకు వచ్చేవాళ్లు.. అపుడు పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు. ఇవాళ కారు బోల్తా పడింది రేపు ప్రభుత్వం కూడా బోల్తా పడుతుందన్నారు. తమ కుటుంబంపై వచ్చిన ఆరోపణల విషయంలో  తన నిజాయితీ నిరూపించుకునేదాక ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. కామారెడ్డిలో ఏది జరిగిన ఇకనుంచి  భరించే ప్రసక్తే లేదన్నారు.

ఎమ్మెల్యే ఆఫీస్‌ ‌ముట్టడి :  కాంగ్రెస్‌ ‌దాడితో ఉద్రిక్తత

ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్‌ ‌కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ సర్పంచ్‌, ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు గిరిరెడ్డి మహేందర్‌రెడ్డి ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వచ్చారు. ఎమ్మెల్యే డౌన్‌ ‌డౌన్‌ అం‌టూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మహేందర్‌రెడ్డి కారును భాజపా కార్యకర్తలు ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైటెన్షన్‌ ‌నెలకొంది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య మాటల యుద్ధం ఉద్రిక్తతలకు దారితీసింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్‌ ‌నేత గిరిరెడ్డి యత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వ, అరోరా కాలేజీ భూములను వెంకట రమణారెడ్డి కబ్జా చేశారని షబ్బీర్‌ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన వెంకట రమణారెడ్డి ప్రభుత్వ కాలేజీ భూములు, శిశుమందిర్‌ ‌పాఠశాల, అరోరా కాలేజీ విషయంలో కాంగ్రెస్‌ ‌నాయకుల ఆరోపణలపై తాను చర్చకు సిద్ధమని తెలిపారు. సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో శిశుమందిర్‌ ‌వేదికపై బహిరంగ చర్చకు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యాంప్‌ ఆఫీసు నుంచి బయటకు రాకుండా హౌస్‌ అరెస్టు చేశారు. మరోవైపు సవాలును స్వీకరించిన కాంగ్రెస్‌ ‌నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ సర్పంచ్‌ ‌గిరిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.  విషయం తెలిసిన బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని కాంగ్రెస్‌ ‌నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *