ములుగు, ఫిబ్రవరి 20: తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దులోని ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం పామునూరు సమీపంలోని కర్రెగుట్టలో జవానులు సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఐఈడీ బాంబు పేలి జవానుకు గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్రెగుట్టల్లోని పామునూరు, జెల్లా గ్రామాల సమీపంలో 39 బెటాలియన్ సీఆర్పీఎఫ్ బృందాలు శుక్రవారం సెర్చ్ అపరేషన్ నిర్వహించాయి. ప్రమాదవశాత్తు ఐఈడీ బాంబు పేలి నవజీత్ అనే జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి పోలీసు బృందాలు పామూనూరు నుంచి జెల్లా గ్రామానికి రోడ్డు వేసే క్రమంలో 11 ఐఈడీ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశారు. 12వ బాంబును గుర్తించి నిర్వీర్యం చేసే క్రమంలో పేలింది. జవాన్ ను హెలికాప్టర్లో హైదరాబాద్ కు తరలించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





