– ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు బృందంతో సీఎస్
హైదరాబాద్, నవంబర్ 14 : రాష్ట్రం పెట్టుబడులకు అనువైనదని, దేశంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్‌గా ఉన్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మూసీ నది సుందరీకరణ, యంగ్ ఇండియా స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటి, రోడ్ల విస్తరణ తదితర ప్రాజెక్టులపై ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రతినిధి బృందంతో ఆయన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్- 2047లో భాగంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్‌లో సివరేజ్ ప్లాంట్‌ల నిర్మాణం. హ్యామ్ రోడ్ల విస్తరణ, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ విద్యుత్ అనుసంధానం, టీజీఆర్టీసీ బస్సులు, యంగ్ ఇండియా స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలలో ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టు వివరాలు, ఆర్ధికపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. పరస్పర సహకారంతో నిర్దేశించిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ప్రణాళిక కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి టి.కె.శ్రీదేవి, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, టిజిఐఐసి డైరెక్టర్ శశాంక, %నవీఔూడూదీ% మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, ముసి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇ.వి.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





