మూడు వారాల్లోగా ఇబ్రహింపట్నం మున్సిపల్‌ ఎన్నిక

– రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 3: ఇబ్రహీంపట్నం మున్సిపల్‌  ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. మూడు వారాల్లోగా ఎన్నిక పక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి మంగళవారం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌన్సిలర్లు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా తమ మద్దతు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. మున్సిపల్‌ ‌చైర్మన్‌ ఎన్నిక జరగాల్సిన సమయంలో 19వ కార్డు బీఆర్‌ఎస్‌ ‌కౌన్సిలర్‌ ఆకుల యాదగిరి కనిపించకుండా పోయాడు. దీంతో తన తండ్రిని ప్రత్యర్థి పార్టీ నేతలు కిడ్నాప్‌ ‌చేశారంటూ యాదగిరి కుమారుడు హైకోర్టులు హెబియస్‌ ‌కార్పస్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టి చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ఎన్నిక పక్రియపై స్టే విధించింది. మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ఎన్నికను మూడు వారాల్లోపు పూర్తి చేయాలని తుది తీర్పును వెలువరించింది .


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *