కళ్ల ముందు కనిపించే మార్పు చూపిస్తా

ప్రియమైన మంథని మున్సిపాలిటీ ఓటర్లకు నమస్కారం..

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంథనిలో అఖండ విజయాన్ని అందించి, నాపై నమ్మకం ఉంచిన మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై మీరు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు.. మీ కళ్ల ముందు కనిపించే మార్పు చూపిస్తాను అని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నా. మీ అందరి సహకారంతో మంథని మున్సిపాలిటీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తా. ఈ గెలుపునకు అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు. విజయ గర్వంతో కాదు.. బాధ్యతతో మీ సేవలో..

ప్రేమతో..
– మీ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *