గ్లోబల్‌ సమ్మిట్‌కు వస్తా

– హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌
– ఆహ్వానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025కు తప్పకుండా హాజరవుతానని హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు హామీ ఇచ్చారు. ఈనెల 8, 9 తేదీల్లో గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించేందుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ హిమాచల్‌ ప్రదేశ్‌కు శుక్రవారం వెళ్లారు. సీఎం సుఖ్వీందర్‌ను కలిసి ఈ సమ్మిట్‌కు హాజరవ్వాలని ఆహ్వానించారు. అనంతరం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఇరువురూ చర్చించారు. తెలంగాణ అభివృద్ధి అద్భుతమని సుఖ్వీందర్‌ కితాబిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *