బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: తన పేరుతో ఎలాంటి సంస్థలు లేవని, అలా సంస్థలు స్థాపించి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కొంతమంది ’కేటీఆర్ సేవా సమితి’, ’కేటీఆర్ సేన’ లాంటి పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు చేపడుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. ’నా పేరుతో ఎలాంటి సంస్థలకు అనుమతి లేదు.. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించబోం’ అని స్పష్టం చేశారు. ఎవరైనా సేవా దృక్పథంతో పనిచేయాలనుకుంటే కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



