– నాపై కేసు వేయడానికి కౌశిక్ రెడ్డి ఎవరు?
– స్పీకర్ తీర్పును స్వాగతించిన దానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11 : తాను బీఆర్ఎస్ పార్టీ మారలేదని, అలాగే తాను పార్టీ మారానని ఏనాడూ ఆ పార్టీ నుంచి నోటీసులు రాలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. స్పీకర్ అనర్హత విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎంపీగా పోటీ చేయడం తన వ్యక్తిగత విషయమని చెప్పారు. హైదరాబాద్ అభివద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏరోజూ పనిచేయలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తనకు ఎప్ప్పుడూ విప్ ఇవ్వలేదన్నారు. స్పీకర్ పరిధిలో తాను ఎక్కడా పొరపాటు చేయలేదని నాగేందర్ పేర్కొన్నారు. స్పీకర్ తీర్పు అనంతరం దానం మీడియాతో మాట్లాడుతూ ‘తాను కేసీఆర్‌కు జవాబుదారీగా ఉంటాను.. ఇన్ని రోజులూ తనపై ఫిర్యాదు చేసిన వాళ్ల గురించి మాట్లాడలేదు. తనపై ఏ అధికారంతో ఫిర్యాదు చేశారని ఇప్ప్పుడు అడుగుతున్నాను. తనపై కొందరు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారు. స్పీకర్ పరిధిలో తాను ఏ తప్పూ చేయలేదు. తీర్పు ఎలా ఉన్నా తనకు ఒకే. ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే సిద్ధమే. పాదయాత్ర చేసి మళ్ళీ గెలుస్తాను. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఉప ఎన్నిక వస్తె భయపడేది లేదు. పోటీ చెయ్యడానికి రెడీనే. తాను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు.. బీఆర్ఎస్‌కి రాజీనామా చెయ్యలేదు. హైదరాబాద్ వాసిగా ఎప్పటికైనా ఎంపీ అవ్వాలని తనకు కోరిక.. అందుకే తాను ఎంపీగా పోటీ చేశానన్నారు. తనకు క్రమశిక్షణపరంగా ఏవైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటే కేసీఆర్‌కు అధికారం ఉందన్నారు. తనపై కేసు వేయడానికి కౌశిక్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు.
——————————————————————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.
–


