ఆక్రమణల తొలగింపులో వెనక్కి తగ్గం

– ఆక్రమణల నుంచి మొత్తం 923 ఎకరాల రక్షణ
– ‘హైడ్రా’ కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌వెల్లడి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22: ఆ‌క్రమణలను తొలగించడంలో వెనక్కి తగ్గేది లేదని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌మరోమారు స్పష్టం చేశారు. ఇప్పటివరకు మొత్తం 923 ఎకరాలను ఆక్రమణల నుంచి రక్షించామని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన డియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు రూ.50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు రక్షించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ ‌నగరంలో దాదాపు 60 చెరువులు కనుమరుగయ్యాయని చెప్పారు. ఆరు చెరువులకు పూర్తిగా పునరుజ్జీవం కల్పించినట్లు వివరించారు. గాజులరామారంలో కొందరు రౌడీషీటర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ఆదివారం అక్కడి ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలనే తొలగించాం. ఇందులో నకిలీ పట్టాలు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వ భూమిలోని 260 నిర్మాణాలను తొలగించాం. ప్రస్తుతం 51 డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు ఉన్నాయి. త్వరలోనే 72కు పెంచుతాం. నగరంలో 150 మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయి. నాలాల వద్ద ఆక్రమణలు గుర్తించి తొలగిస్తున్నాం. వాటిలో పూడిక తొలగింపును ముమ్మరం చేశాం. వర్షం నీరు చెరువుల్లోకి వెళ్లే పరిస్థితి, నీరు నిల్వ చేసే పరిస్థితి లేదు. కాంక్రీటైజేషన్‌ ‌వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదు. అధిక కాలుష్యం వల్ల నగరాల్లోనే వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. భవిష్యత్‌ అం‌తా యువతరానిదే కాబట్టి పార్కులు, చెరువుల గురించి జన్‌ ‌జడ్‌ ఆలోచించాలని రంగనాథ్‌ ‌సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *