సామాజిక కోణంలోనే వారి జోలికి వెళ్లలేదు

హైడ్రా రంగనాథ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18 : కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని, భావితరాలకు భవిష్యత్తును ఇచ్చేందుకే హైడ్రా పనిచేస్తోందని హైడ్రా కమిషనర్‌ ఏ.వి.రంగనాథ్‌ చెప్పారు. చెరువులను కాపాడాలనే ఉద్దేశంతో తాము దూకుడుగా వెళ్లడం వల్లే చెరువుల ఆక్రమణలు తగ్గాయని గుర్తుచేశారు. హైడ్రా ఏర్పాటు చేసి శుక్రవారం(జులై18)తో ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా అంబర్‌పేట బతుకమ్మ కుంట వద్ద హైడ్రా ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో సామాజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదన్‌ి స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 21వ తేదీన బతుకమ్మ కుంటను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. హైడ్రా అంటే డిమాలిషన్‌, డెవలప్‌మెంట్‌ అని అభివర్ణించారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన బతుకమ్మకుంట శాంపిల్‌ మాత్రమేనని.. త్వరలో ఎన్నో బతుకమ్మ కుంటలు వెలుగులోకి వస్తాయని రంగనాథ్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన, మాజీ ఎంపీ వి.హనుమంతురావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *