– ఓడిపోతామనే భయంతోనే అరాచకాలకు పాల్పడ్డారు
– కాంగ్రెస్‌పై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచఎంసీ)ను అశాస్త్రీయంగా మూడు భాగాలుగా విభజించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తీవ్రంగా విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం.. కోర్ హైదరాబాద్‌ను దారుస్సలాం కేంద్రంగా ఉన్న మజ్లిస్ పార్టీకి తాకట్టుపెట్టే విధంగా జీహెచఎంసీని విభజించి జీహెచఎంసీతోపాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్‌గా విభజించిందన్నారు.
ఓటమి భయంతోనే అరాచకాలు
కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో అధికార దుర్వినియోగానికి, అనేక అరాచకాలకు పాల్పడిందని ఆరోపించారు. ఈ కారణంగానే మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయనది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యగానే తాము భావిస్తున్నామని రామచందర్‌రావు అన్నారు. మంచిర్యాలలో కూడా తమ కార్యకర్తలు, నాయకులపై బెదిరింపులకు దిగారన్నారు. ఇండ్లపై దాడులు చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల డైరెక్షన్లతో పోలీసులు పనిచేయడం అప్రజాస్వామిక చర్య అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ పట్టును కోల్పోతాననే భయంతోనే ఈ అరాచకాలకు పాల్పడిందని ఆరోపించారు. పోలింగ్ రోజున కూడా అనేక కేంద్రాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసి పోలింగ్ సెంటర్ల వద్ద నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరిగినా తమ కార్యకర్తలు వెనుకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు. ఈ సంఘటనలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారÁని తాము విశ్వసిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ పోలీసుల సమక్షంలోనే బూత్‌ల లోపల, బయట విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ చేసిందని ఆరోపించారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేదా పోలీసుల నుంచి సరైన స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నదా అనే అనుమానం కలుగుతోందన్నారు. నారాయణఖేడ్, సుల్తానాబాద్, చెన్నూరు, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, ఖానాపూర్, సదాశివపేట్, ఎల్లంపేట్, వైరా, కొత్తగూడెం, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఒకవైపు ధన ప్రలోభాలు, మరోవైపు పోలీసు ఒత్తిళ్లు, నాయకుల బెదిరింపులు.. వీటన్నింటినీ బీజేపీ¾ కార్యకర్తలు భరించి పార్టీ కోసం అంకితభావంతో కృషి చేశారన్నారు. కాంగ్రెస్‌కు అనేక స్థానాల్లో ఓటమి తప్పదని, బీఆరఎస్ కూడా అరకొర తప్పితే గెలిచేదేమీ లేదని స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్య పోరాటం.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిదీ.. పోలీసులను అడ్డుపెట్టుకుని బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించబోం. అని కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారు. తమ కార్యకర్తలు ప్రతిఘటిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుల వేధింపులకు భయపడి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని, పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




