– మధ్యాహ్నం కల్లా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం
హైదరాబాద్, సెప్టెంబర్ 5: గణేశ్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి శనివారం ఉదయం 6 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దీంతో నిమజ్జనాన్ని చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేందుకు, తిరిగి వెళ్లే ప్రయాణికులకు మేలు కలగనుంది. కాగా, గణేశ్ ఉత్సవాలకు సంబంధించి గత 20 రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేశామని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేస్తామన్నారు. మండప నిర్వాహకులు త్వరగా బయలుదేరి రావాలని కోరారు. నిమజ్జనాలకు సంబంధించి చెరువులన్నింటినీ పరిశీలించినట్లు మీడియాకు చెప్పారు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల సూచనల మేరకు మండపాల నిర్వాహకులు వెళ్లాలని, వాహనాలు, విగ్రహాలు ఎత్తు ఎక్కువగా ఉంటే పోలీసుల అనుమతితో నిమజ్జనానికి తీసుకెళ్లాలని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రతి ఏరియాపై మ్యాప్ వేసుకొని రూట్లు నిర్ణయించామన్నారు. రోడ్లపై డైవర్షన్ ఉన్నచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. శనివారం సుమారు 50వేల విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయని సీవీ ఆనంద్ తెలిపారు.
గణేశ్ నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ తెలిపారు. 34 ప్రధాన చెరువులు, 64 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 40లక్షల మంది భక్తులు పాల్గొని శోభాయాత్ర తిలకిస్తారని వెల్లడిరచారు. అన్న ప్రసాదాలు, తాగునీటి వసతి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో పనిచేస్తామని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



