హైదరాబాద్‌ ‌సైబర్‌ ‌క్రైమ్‌ ‌పోలీసుల ఆపరేషన్‌

– 16 ‌రాష్ట్రాల్లోని 104 మంది సైబర్‌ ‌నేరగాళ్ల అరెస్ట్

‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 24:’ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ ‌పేరుతో హైదరాబాద్‌ ‌సైబర్‌ ‌క్రై ‌పోలీసులు భారీ ఆపరేషన్‌ ‌చేపట్టారు. మొత్తం 16 రాష్టాల్ల్రోని 104 మంది సైబర్‌ ‌నేరగాళ్లను అరెస్ట్ ‌చేశారు. నిందితుల్లో బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు. 32 బృందాలతో 16 రాష్టాల్ల్రో 10 రోజుల పాటు ఈ ఆపరేషన్‌ ‌కొనసాగింది.  నిందితులపై దేశవ్యాప్తంగా 1,055 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు వీరు పలు సైబర్‌ ‌నేరాల్లో రూ.127 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు నిర్దారించారు. వారి నుంచి రూ.36 లక్షల నగదుతోపాటు 204 మొబైల్‌ ‌ఫోన్లు, 141 సిమ్‌కార్డులు, 152 బ్యాంక్‌ ‌పాస్‌బుక్‌లు, 234 డెబిట్‌ ‌కార్డులు, 26 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *