– ‘దిశ’ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్18: నగరంలో నిధుల కొరత ఉన్నప్పటికీ లభ్యమవుతున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ, కేంద్ర సహాయ పథకాలు, ప్రాజెక్టుల అమలు స్థితిపై గురువారం ఆయన సక్షించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ అంటే కేవలం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ మాత్రమే కాదు.. నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది. నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా రహదారులు జలమయమై ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల వర్షాల కారణంగా నాంపల్లిలో ఇద్దరు, సంతోష్‌నగర్‌లో ఒకరు నాలాలో కొట్టుకుపోవడం దురదృష్టకరం. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేసి నగర ప్రాధాన్యతను గుర్తుంచుకొనిహైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకోవాలని సూచించారు. ఏ బస్తీకి వెళ్లినా వర్షపు నీరు, వరదలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో డ్రైనేజీ సిస్టం దెబ్బతిని తాగునీటిలో కలిసిపోతోంది. అన్నీ రిస్టోర్ చేసి శుభ్రం చేయాలి. స్కూల్స్, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు పరిష్కరించుకోవాలని కిషన్‌రెడ్డి అన్నారు. ‘దిశ’ సమావేశంలో ఎంపి ఈటెల రాజేందర్ సహా పలువురు నేతలు, కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





