– మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: ప్రపంచంలోని దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల(జీసీసీల) ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానంగా ఎంచుకున్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. నైపుణ్యాలతో కూడిన టేలెంట్ పూల్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్య లేని రోడ్లు, అందుబాటులో ఉండే అద్దెలు ప్రముఖ కంపెనీలని ఆకర్షిస్తున్నాయని తెలిపారు. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పికో టెక్నాలజి సంస్థ ప్రతినిధులు సచివాలయంలో శ్రీధర్‌బాబుతో శనివారం భేటీ అయ్యారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఫైనాన్సియల్ మార్కెట్‌కు సంబంధించిన సేవలు అందించే పికో టెక్నాలజీ సంస్థ పికో టెక్నాలజీ ఇండియా అనే అనుబంధ కంపెనీ ద్వారా ఇక్కడ జీసీసీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ సంసర్భంగా శ్రీధర్‌బాబు వారికి ఇక్కడి అవకాశాలు, మౌలిక వసతుల గురించి వివరించారు. రానున్న 5-10 సంవత్సరాలు, తర్వాత 20 సంవత్సరాల అవసరాలకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. బెంగళూరు, ముంuయి నగరాలతో పోలిస్తే ఇక్కడ ఆఫీసు స్థలాల ఆక్యుపెన్సీ 73 శాతం ఉందని చెప్పారు. ముంuయిలో అది 52 శాతం మాత్రమేనని తెలిపారు. బెంగళూరు, ముంuయి మెట్రో నగరాల్లో ట్రాఫిక్, వాయు కాలుష్యం ప్రధాన సమస్యలుగా మారినందున ఐటి సంస్థలు, జిసిసిలు హైదరాబాద్‌కు తరలి వస్తున్నాయని తెలిపారు.
రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు : కోమటిరెడ్డి
ఇప్పుడున్న నెహ్రూ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల వెలుపల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్టు ఆర్అండ్‌బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. దానికి అనుబంధంగా రేడియల్ రోడ్లు ఏర్పాటవుతున్నాయని, రింగ్ రోడ్ల పక్కన రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి రవాణా సదుపాయాలను ప్రపంచంలోని పెద్ద నగరాలను తలదన్నేలా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. హయత్‌నగర్- ఎల్బీనగర్‌ల మధ్య డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మిస్తున్న్నట్టు చెప్పారు. కింది రోడ్డు స్థానిక ట్రాఫిక్ అవసరాలకు వినియోగిస్తామని, పైన ఉండే రెండు అంతస్థుల రోడ్లు నగరం నుంచి వెలుపలకు, లోపలికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకిస్తామని చెప్పారు. నాగపూర్ తర్వాత డబుల్ డెక్కరో రోడ్లు నిర్మిస్తున్న నగరం ఇదేనని అన్నారు. రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సమావేశంలో పికో టెక్నాలజి వ్యవస్థాపక సిఇఓ జారొడ్ యుస్టర్, పికో ఇండియా సిఈవో హరి కోదండరామన్, డైరెక్టర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు. పికో టెక్నాలజి సీఈవో జారొడ్ యుస్టర్‌కు మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి జ్ణాపిక అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




