– గౌరవెల్లి ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలి
– తాగునీటికి రూ.60కోట్లు అవసరం
– డ్రైనేజీ నిర్మాణానికి రూ.80 కోట్లు
– పట్టణానికి రింగ్‌రోడ్డు
– ముఖ్యమంత్రికి ప్రతిపాదించిన మంత్రి పొన్నం
హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: హుస్నాబాద్ ప్రాంతంలో పాడి పశు సంపద అధికంగా వుండే ఈ ప్రాంతంలో రైతులకు వ్యవసాయం పాల ఉత్పత్తి మీదనే ఆధారపడతారు. అందువల్ల వారికి చేయూత అందించాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బుధవారం హుస్నాబాద్ లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణం నాలుగు జిల్లాలకు మధ్యలో వున్నందువల్ల రింగ్ రోడ్డు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ ప్రాంత రైతాంగానికి వర ప్రదాయిని గౌరవెల్లి ప్రాజెక్ట్ కు ప్రజా ప్రభుత్వం లోనే దానికి ముందు అడుగులు పడుతున్నాయని గుర్తుచేశారు. వచ్చే సీజన్ లో గౌరవెల్లి ప్రాజెక్ట్ ద్వారా ప్రతి పల్లెకు నీళ్ళు అందించేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన హుస్నాబాద్ నియోజకవర్గానికి కావాల్సిన అంశాలపై రేవంత్ రెడ్డి ముందు కొన్ని ప్రతిపాదనలుంచారు. హుస్నాబాద్ మున్సిపాలిటీకి సమగ్ర తాగునీటి సరఫరా పథకం అమలుకు రూ.60 కోట్లు అంచనాతో ప్రతిపాదించారు. దీనిద్వారా పట్టణంలోని ప్రతి గృహానికి 24 గంటల తాగునీరు అందించడం ప్రధాన లక్ష్యం. డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.80కోట్లు ఖర్చు కాగలవు. పట్టణానికి రింగ్‌రోడ్డు నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇది ఈ ప్రాంత రవాణా అభివృద్ధికి అత్యవసరం. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధుల మంజూరు చేయాలి. నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు స్యాచురేషన్ మోడ్‌లో డైరీ పశువుల సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించారు. గౌరవెల్లి సాగునీటి ప్రాజెక్టు మిగిలిన పనుల పూర్తికి మంజూరైన నిధుల విడుదల చేయాలి. ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. హుస్నాబాద్ అభివృద్ధి ప్రజా పాలన ప్రభుత్వంలో మరింత వేగంగా జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




