తాగుబోతు భర్తను హత్య చేసిన భార్య

– చున్నీతో ఉరి బిగించి హత్య

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: హైదరాబాద్‌ ‌పాత బస్తీలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. పాతబస్తీ భవానీనగర్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు మహమ్మద్‌ ఇషాక్‌గా పోలీసులు గుర్తించారు. అతడు ఆటోనడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇషాక్‌ ‌మద్యానికి బానిసవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే గత రాత్రి కూడా ఇరువురి మధ్య వాగ్వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతోమద్యం సేవించి రోజూ గొడవపడుతున్న భర్తను నిద్రలో ఉండగానే నూర్జహాన్‌ ‌బేగం చున్నీతో గొంతు బిగించి హత్య చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌ ‌మార్చురీకి తరలించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *