యాదగిరిగుట్ట ఆల‌య‌ హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు

– పటిష్టమైన భద్రత మధ్య లెక్కింపు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ
ఆదాయం రూ.4,03,02,821 వ‌చ్చింది. కొండ కింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఆలయ అధికారులు, సిబ్బందితో స్వామివారి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు.  తెలిపిన 49 రోజుల హుండీ ఆదాయం రూ.4,03,02,821 వ‌చ్చిందని ఆలయ కార్య నిర్వహణ అధికారి భవానీ శంక‌ర్ తెలిపారు. మిశ్ర‌మ‌ బంగారం 136 గ్రాములు, వెండి 3 కిలోల 600 గ్రాములు, అమెరికా-1605 డాలర్లు, ఆస్ట్రేలియా 225 డాలర్లు, ఇంగ్లాండ్ 165, పౌండ్స్, నేపాల్ -20 రుపిస్, సింగపూర్-71 డాలర్స్, ఒమన్ 100 రియల్-39, శ్రీలంక-2600 స్వామివారి హుండీ ఆదాయం వచ్చినట్టు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *