రికార్డుస్థాయిలో యాదాద్రి ఆల‌య హుండీ ఆదాయం

– కార్తీక మాసంలో 25ల‌క్ష‌లకు పైగా భ‌క్తుల రాక‌
– కొండ కింద స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర,  నవంబర్ 24 : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం ఆలయ అధికారులు. హుండీ లెక్కింపు నిర్వహించారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మండపంలో అత్యంత భద్రత మధ్య స్వామి వారి 63 రోజుల హుండీని లెక్కించారు. యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకటరావు  తెలిపిన వివరాల ప్రకారం స్వామి వారి హుండీ లెకింపులో గతములో  44 రోజుల హుండీ ఆదాయం  రూ.4,47,66,560/- ఆదాయం రాగా.  మిశ్రమ బంగారం 115 గ్రాములు  మిశ్రమ వెండి 6 కిలోలు 50 గ్రాములు వచ్చింది. ప్రస్తుతం కార్తీక మాసం సందర్భంగా  63 రోజుల హుండీ ఆదాయం రూ.4,80,77,919/- మిశ్రమ బంగారం 177 గ్రాములు  మిశ్రమ వెండి 9 కిలోలు 700 గ్రాములు వచ్చినట్లుగా తెలిపారు. విదేశీ కరెన్సీ విష‌యానికి వ‌స్తే, అమెరికా -2014 డాలర్లు, ఇంగ్లాండ్-65  పౌండ్లు, సౌదీ అరేబియా -61 రియాల్.ఒమన్- రియాల్, మలేసియా-51 రింగ్గిట్స్. యూరో-15, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – 970 దీనార్లు, కెనడా -1245 డాలర్లు, న్యూజీలాండ్ – 95, ఆస్ట్రియా–75,  సింగపూర్-41, క్వీట్ -2 1/4, ఖ‌తార్‌-318, మెక్సికో- 20, చైనా- 20, నేపాల్-5, పోలండ్-70, థాయిలాండ్- 40, శ్రీలంక -10, భూ టాన్– 1 వచ్చినట్టు తెలిపారు. ఈ కార్తీక మాసంలో 25 లక్షల పైగా భక్తులు రికార్డుస్థాయిలో స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే వేల సంఖ్యలో భక్తులు కొండ కింద‌ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో వ్రతాలు నిర్వహించారని  ఈవో తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page