– రూ.84.15 కోట్ల మోసం జరిగినట్లు గుర్తింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీ జీఎస్టీ కుంభకోణాన్ని బయటపెట్టింది. సుమారు రూ.84.15 కోట్ల విలువైన ఐటీసీ మోసం జరిగినట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు, ఎస్‌కేజీ ట్రేడింగ్ కంపెనీ ప్రొప్రైటర్ సందీప్‌ను అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు గుర్తించారు. సందీప్‌కు సంబంధమున్న ఇతర సంస్థల్లోనూ అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈక్రమంలో వాటి రిజిస్టేష్రన్లను అధికారులు రద్దు చేశారు. సందీప్‌ను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.