– ప్రభుత్వం సమాధానం చెప్పాలి: కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21: రాష్ట్రంలోని ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు తగ్గిపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగాలు తగ్గాయని ప్రభుత్వం ఒక్క వారంలోనే రెండుసార్లు ఒప్ప్పుకోవడం ఆందోళనకరమైన విషయమని అన్నారు. 2023లో హైదరాబాద్‌లోని ఐటీ రంగంలో 9.46లక్షల ఉద్యోగాలు ఉండేవని ఆయన గుర్తు చేశారు. కానీ 2026 నాటికి అవి 9.39 లక్షలకు తగ్గాయని ప్రభుత్వం ఒప్ప్పుకుందన్నారు. ఈ విషయాన్ని మొదట 16వ తేదీన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా వెల్లడించారని, అనంతరం బ్జడెట్ ప్రవేశపెడుతున్న సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారని గుర్తు చేశారు. ఈ ఉద్యోగాల తగ్గుదలకు కృత్రిమ మేధస్సు కారణమా? లేదా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




