రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

– భక్తులతో ముచ్చటించిన ఇన్‌చార్జి కలెక్టర్

సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే క్యూలైన్లు నిండిపోగా భక్తులు బారులు తీరారు. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ త‌దిత‌ర ప్ర‌ముఖులు రాజ‌న్న‌ను ద‌ర్శించుకున్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ భక్తుల వద్దకు వెళ్లి ఏర్పాట్లపై ఆరా తీశారు. అధికార, దేవస్థానం యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తుల స్పందనను తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ కల్పించిన సౌకర్యాలు ఎలా ఉన్నాయి.. ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అంటూ ఇన్‌చార్జి కలెక్టర్ అడిగారు. భక్తులు స్పందిస్తూ ఏర్పాట్లు బాగున్నాయని, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, క్యూ లైన్లలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఇతర చర్యలపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలిం మహిళా భక్తులను పలకరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *