– అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీ మొత్తంలో నగదు పట్టుకున్నారు. సోమ వారం సాయంత్రం గోషామహల్ గ్యాన్బాగ్ కాలనీలోని గోకుల్ గోల్డ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాప్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా సంచులతో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వీరిని ఆపి పరిశీలించగా.. సంచుల్లో భారీగా డబ్బు ఉన్నట్లు బయటపడింది. తనిఖీలో మూడు సంచుల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం నగదు విలువ రూ.76,87,650గా నిర్ధారణైంది. నగదు తరలింపు తీరు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. అనుమానితులను జ్యోతిరామ్, గణపతి రామ్, మహేందర్ లుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురినీ గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించి నగదుపై విచారణ చేపట్టారు. విచారణ సమయంలో అనుమానితులు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతోపాటు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను సమర్పించలేకపోయారు. దీంతో నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై గోషామహల్ ఇన్ స్పెక్టర్ స్పందిస్తూ స్వాధీనం చేసుకున్న నగదును ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. అక్రమ నగదు తరలింపులపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




