హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై19: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థిని పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు. ఎవరు పోటీలో ఉన్నా కాంగ్రెస్ విజయం లక్ష్యంగా కృషి చేస్తామని అన్నారు. బనకచర్ల విషయంలో హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణలో పాలన జరుగుతోందని వివరించారు. నిత్యం విమర్శలే లక్ష్యంగా హరీష్ రావు ఎజెండాగా ఉందన్నారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఎంపీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మురళీగౌడ్, సంజయ్‌గౌడ్ పార్టీలో చేరారు. వారికి మహేశ్‌కుమార్ గౌడ్ కండువా కప్పి ఆహ్వానించారు.
జూబ్లీహిల్స్ గెలుపు మాదే: పీసీసీ చీఫ్





