– సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగసు్ట 24: తెలంగాణ రాష్ట్రాన్ని బయోడిజైన్స్, లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీలకు కేంద్రంగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నొవేషన్ సమ్మిట్ 2025ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఇన్నోవేషన్ ఆఫ్ భారత్ – ది బయోడిజైన్ బ్లూప్రింట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భారత దేశంలో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి స్వదేశీ పరిశోధనలు అత్యవసరమన్నారు. హైదరాబాద్ ఇప్పటికే మాన్యుఫాక్చరింగ్, మెడికల్ రీసెర్చ్ రంగాల్లో కేంద్రంగా ఎదుగుతోందని, బయోటెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో ఆవిష్కరణలకు అన్ని విధాల మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని స్పష్టం చేశారు. సుల్తాన్‌పూర్‌లో భారత్‌లోనే అతిపెద్ద మెడికల్ డివైజ్ పార్కును ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయన్నారు. 2047 నాటికి తెలంగాణను దేశంలో ఒక ముఖ్యమైన ఆర్థిక శక్తిగా చేసేందుకు తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. బయోడిజైన్ ఉపయోగించి వైద్య ఉత్పత్తుల ఆవిష్కరణల సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. దేనినైనా మనం రూపొందిస్తే దాని ప్రయోజనం, పనితీరు, రూపం ప్రాథమిక అంశాలుగా ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడిరచారు. ఈ కార్యక్రమంలో ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





