– సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్
– వెలుగుమట్ల బాధితుల ధర్నాతో దద్దరిల్లిన ధర్నా చౌక్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లను కూల్చినచోటనే అందరికీ ప్రభుత్వం ఇళ్ల్లు నిర్మించి ఇవ్వాలనే నినాదాలతో హైదరాబాదులోని ధర్నా చౌక్ బుధవారం దద్దరిల్లింది. వెలుగుమట్లకు చెందిన దాదాపు 300మంది బాధితులు అనేక ఇబ్బందులను, అక్రమ అరెస్టులను ఎదుర్కొని హైదరాబాద్‌కు తరలి వచ్చారు. ధర్నాకు అనుమతి ఇచ్చినప్పటికీ ఖమ్మంలో పోలీసులు అర్ధరాత్రి దాకా హైదరాబాద్ బయలుదేరకుండా అనేక ఆటంకాలు కలిగించారు. వెలుగుమట్ల బాధితులు ఎవరూ హైదరాబాద్ వెళ్లరాదని ప్రభుత్వం కొంతమందిని అక్రమంగా అరెస్టు చేసినప్పటికీ బాధితులు పెద్ద ఎత్తున హైదరాబాదుకు చేరుకుని ధర్నాలో పాల్గొని కూల్చిన చోటనే అందరికీ ఇళ్ల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య అధ్యక్షత వహించిన ఈ ప్రజా ధర్నాను రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె.వి.చలపతిరావు ప్రారంభించారు. వెలుగుమట్లలో కొంతమందికి ఇళ్ల్లు కట్టిస్తామని చెప్పి పట్టా కాగితాలు ఇచ్చి సమస్య అయిపోయిందని చేతులు దులుపుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం అన్యాయమన్నారు. కేవలం 400 మందికే ఇళ్ల్లు కట్టిస్తామని మిగతా 700 మంది బాధితులకు మొండి చెయ్యి చూపడం దారుణని అన్నారు. వెలుగుమట్లలోని మొత్తం 61 ఎకరాల్లో గల భూదాన్ భూమి ఏమీ లేని పేదలకు, నిరుపేదలకు చెందాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పేదల నివాసం కోసం ఇండ్లను ప్రభుత్వం ఇవ్వడం అనేది బాధ్యతగా ఉండాలన్నారు. అది పేదల హక్కు అని పాలకులు, ప్రభుత్వం ఇకనైనా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటాన్ని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, బుద్ధి జీవులు బలపరచాలని కోరారు. ఇది రాష్ట్రవ్యాప్తం కాకముందే రేవంత్ సర్కార్ యుద్ధప్రాతిపదికన ఈ సమస్యను పరిస్కరించాలని వక్తలు డిమాండ్ చేశారు. బాధితులలో మహిళలే అత్యధికంగా హాజరైన ఈ ధర్నాలో సీపీఎం రాష్ట్ర నాయకుడు బండారు రవికుమార్, సీపీఐ రాష్ట్ర నాయకుడు బోస్, ఎంసీపీఐ(యు) రాష్ట్ర నాయకుడు వరికుప్పల వెంకన్న, సీపీఐ (ఎం-ఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, జర్నలిస్టులు మన తొలి వెలుగు రఘు, కాళోజి టీవీ దాసరి శ్రీనివాస్, సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాదినేని వెంకటేశ్వర్ రావు, ఆవూరి మధు, కె.గోవర్ధన్, పీవోడబ్ల్యూ జాతీయ నాయకు లు వి.సంధ్య, జి.ఝాన్సీ, సిఎల్‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు. ఓపిడిఆర్ రాష్ట్ర అధ్యక్షుcT డాక్టర్ జతిన్ కుమార్, ప్రధాన కార్యదర్శి విజయంధర్ రావు, మూసీ బచావో నాయకురాలు మంజుల, తెలంగాణ ఐక్య ఉద్యమ నాయకుడు దేశాయ్ కరుణాకర్ రెడ్డి, పీడీిఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్, ఏఐఎఫ్‌టి యు రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్ తదితరులు మాట్లాడారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





