– హాస్టళ్ల పరిస్థితి మరింత దారుణం
– ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బావర్చి మూసివేత
– ప్యారడైజ్ హోటల్‌దీ అదే దుస్థితి
– బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు తప్పవన్న అధికారులు
సిలిండర్ల కొరత తీవ్రంగా మారి.. హోటల్, టిఫిన్ సెంటర్లు, పేయింగ్ గెస్ట్ హాస్టళ్ల నిర్వహణను సంక్షోభంలోకి నెట్టింది. సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో పలు హోటళ్లు తాత్కాలికంగా మూతపడగా, మరికొన్ని చోట్ల టిఫిన్లు, టీ-కాఫీ అమ్మకాలు నిలిపి వేశారు. హాస్టళ్లలో దోసె, పూరీ వంటి వంటకాలను నిలిపివేసి సాధారణ భోజనం మాత్రమే అందిస్తున్నారు. మార్కెట్లో సిలిండర్లు దొరకకపో వడంతో కొన్ని ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయాలు జరుగుతుండగా, చిన్న హోటళ్లు, బండి వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి
పలు హోటల్స్ మూత
కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేకపోవడం, మార్కెట్‌లో అధిక ధర ఉండడంతో కొనుగోలు చేయలేక పలు హోటల్స్ మూతపడుతున్నాయి. సిలిండర్ కొరతతో హోటల్స్ మూసేస్తున్నట్లు యజమానులు ప్రకటించారు. అవసరమైతే కట్టెల పొయ్యి మీద వంట చేస్తామని చెప్పారు. ఇక పలు ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్‌లో కమర్షియల్ సిలిండర్ సరఫరా లేకపోవడంతో హోటల్ మూసివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టిఫిన్ సెంటర్ బందు చేసుకోవాల్సి వస్తదేమోనని ఆందోళన చెందారు. అప్జల్‌గంజ్, బేగంబజార్‌లో కొన్ని టిఫిన్ సెంటర్లలో గ్యాస్ లేకపోవడంతో మూసేస్తున్నారు. వేల రూపాయలు పెట్టి సిలిండర్ కొనుగోలు చేసి వ్యాపారం ఎలా చేస్తామని చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కొరతతో పలు ప్రాంతాల్లో బిర్యానీ సెంటర్లు మూతపడ్డాయి. పలు ప్రాంతాల్లో వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో టీ షాపులు, బండి వ్యాపారులు, టిఫిన్ సెంటర్ల నిర్వహకులు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాడుతున్నారు. కొందరూ గృహ వినియోగదారులు 14కిలోల గ్యాస్ సిలిండర్‌ను రూ.1800ల వరకు అమ్ముతున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు మూతపడుతున్నాయి. గృహావసరాల సిలిండర్ల సరఫరా తగ్గడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే రూ.5 భోజనానికి ఇబ్బంది ఉండదని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.విద్యుత్‌తో నడిచే యంత్రాలతో భోజనం తయారు చేస్తున్న దృష్ట్యా గ్యాస్ కొరత ప్రభావం తయారీపై ఉండబోదని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. సిలిండర్లకు ప్రత్యామ్నాయ మర్గాలను నిర్వాహకులు ఆన్వేషిస్తున్నారని అర్‌పేట హాస్టళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాజారావు చెబుతున్నారు. బుధవారం అర్‌పేట ప్రాంతంలోని హాస్టల్ నిర్వాహకులు 120కుపైగా ఎలక్టిక్రల్ స్టౌలు కొనుగోలు చేసినట్లు సమాచారం. కొందరు క్టటెల పొయ్యి ఏర్పాటుచేసుకున్నారని దుర్గానగర్ హాస్టళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ చెప్పారు. గ్యాస్ కొరత నేపథ్యంలో హాస్టళ్ల యజమానులంతా ఒక్కటయ్యారు. నిర్వహణ విషయంలో తాత్కాలిక నిబంధనలు రూపొందించి అమలుచేస్తున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల కోసం నగరానికి వచ్చిన యువతకు ఆశ్రయమిచ్చే పేయింగ్ గెస్ట్ హాస్టళ్ల నిర్వహణ ఇప్పుడు మరింత భారంగా మారింది. మహారాష్ట్ర, ఒడిశా, ఆంధప్రదేశ్ రాష్ట్రాల నుంచి కోర్సులు నేర్చుకోడానికి వచ్చే విద్యార్థుల సంఖ్య ఏడాదిగా బాగా తగ్గింది. దాంతో ప్రైవేటు హాస్టళ్ల వ్యాపారం మందకొండిగా నడుస్తోంది. గ్యాస్ కొరత మమ్మల్ని మరింత నష్టాల్లోకి నెడుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాం. హాస్టల్‌లో ఉంటున్నవారికి అన్నం, కూర, సాంబారైనా వడ్డించడానికి ప్రత్నిస్తున్నాం అంటున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




